AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తీవ్ర వాయుగుండం బలహీనపడుతున్నప్పటికీ ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం ప్రాంతాల్లో వర్షాలు, గోదావరిలో వరద ప్రవాహంపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. తెలంగాణలోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలకు అవకాశం ఉంది. IMD తాజా అప్‌డేట్ల ప్రకారం రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Weather Alert
Shaik Madar Saheb
|

Updated on: Sep 27, 2026 | 7:32 AM

Share

తీవ్ర వాయుగుండం తీరని నష్టాన్ని మిగిల్చింది. అన్నదాతను ఆగంజేసింది. ముఖ్యంగా ఏపీలో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద మాత్రం వదలడం లేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ ప్రస్తుతం 32.5°N/72.5°E, గుర్దాస్‌పూర్, చండీగఢ్, ముజఫర్‌నగర్, అలీగఢ్, ధోల్‌పూర్, ఉదయ్‌పూర్, డిసా, నలియా, 23.0°N/67.8°E గుండా కొనసాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై ఉన్న వాయుగుండం బలహీనపడి బాగా గుర్తించదగిన అల్పపీడన ప్రాంతంగా (Well-Marked Low Pressure Area) మారే అవకాశం ఉంది.

తెలంగాణ వాతావరణ సూచన:

దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం, సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. వర్షాలు తగ్గడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది.

ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

కాగా.. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి స్వల్పంగా వరద పెరుగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో/ఔట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులుగా ఉందన్నారు. ఆదివారం నాడు వరద ప్రవాహం 8-9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం. అనంతరం క్రమంగా తగ్గవచ్చు. అత్యవసర సహాయం కోసం NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్‌వేలు దాటవద్దని.. ఏమైనా సమస్య ఉంటే సమాచారం ఇవ్వాలని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?