Bigg Boss 10: కంటెస్టెంట్‌కు చుక్కలు చూపించిన నాగార్జున.. ఆ ఇద్దరికి సీరియస్ వార్నింగ్
బిగ్ బాస్ హౌస్‌లో శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. నాగార్జున శ్రిష్టి, సుధీర్, నరేష్, దేబ్జానీ, ముఖేష్, రోహిత్, త్రిగుణ్, షాలినీ తదితర కంటెస్టెంట్లకు కీలక సూచనలు ఇచ్చారు. మరోవైపు సిగ్మా మూవీ ప్రమోషన్స్‌తో సందీప్ కిషన్, సంజయ్ సందడి చేశారు.

బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి వారం ఏదో ఒక కొత్త ట్విస్ట్‌తో కంటెస్టెంట్లకు షాక్ ఇస్తుంటారు. అయితే ఈసారి మాత్రం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సాధారణంగా షో చివరి దశల్లో కనిపించే ‘బ్రీఫ్‌కేస్ మనీ’ టాస్క్‌ను ఏకంగా మూడో వారంలోనే తీసుకొచ్చారు. అది కూడా రూ.5 లక్షలతో మొదలై ఏకంగా రూ.15 లక్షలకు చేరింది. చివరికి ఈ భారీ ఆఫర్‌ను మిథిలేష్ స్వీకరించడంతో శనివారం ఎపిసోడ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. అంతకుముందు జరిగిన పరిణామాలను నాగార్జున ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ కంటెస్టెంట్లకు క్లాస్ తీసుకున్నారు. శనివారం ఎపిసోడ్ ప్రారంభంలో శుక్రవారం జరిగిన కొన్ని ముఖ్యమైన పరిణామాలను చూపించారు. కెప్టెన్‌గా ముఖేష్ వ్యవహరించిన తీరు, మిథిలేష్ విషయంలో చేసిన కామెంట్లు, శ్రిష్టి గురించి షాలినీ చేసిన చర్చ వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత శ్రిష్టిని కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచిన నాగార్జున.. సుధీర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుధీర్ మాటలు తన గత అనుభవాలను గుర్తు చేశాయని, అందుకే తాను కంట్రోల్ కోల్పోయానని శ్రిష్టి చెప్పుకొచ్చింది. అయితే జరిగిన విషయాన్ని పదే పదే పట్టుకుని కూర్చోకుండా ముందుకు వెళ్లాలని నాగార్జున సూచించారు.
ఒక్క వివాదం.. దెబ్బకు కెరీర్ కొలాప్స్..! పెళ్ళైన హీరోతో యవ్వారం.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్
గతంలో జరిగిన అనుభవాలను ప్రస్తుత సంబంధాలపై ప్రభావం చూపించకుండా చూసుకోవాలని ఆమెకు క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాత సుధీర్‌ను పిలిచిన నాగార్జున.. శ్రిష్టితో వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా ఫ్రీడం వంటి పదాలు ఉపయోగించడం, శ్రిష్టితో తన ప్రాక్టీస్ గురించి మాట్లాడిన విధానం ఎందుకు వివాదానికి దారితీసిందో వివరించారు. సుధీర్ క్లారిటీ ఇస్తుండగా మధ్యలోనే నాగార్జున జెండర్‌కు సంబంధించిన వ్యాఖ్యలపై ప్రశ్నించారు. ఎదుటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతారో కూడా ఆలోచించి మాట్లాడాలని సూచించారు. నరేష్‌కు అన్యాయం జరిగిందని అతను భావిస్తున్నాడా.? అని నాగార్జున అడిగారు. దానికి నరేష్ అవునని సమాధానం ఇచ్చాడు. దీంతో త్రిగుణ్‌ను పిలిచి.. నరేష్‌ను ఎందుకు దగ్గరగా ఉంచావని ప్రశ్నించారు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో చూపించే వీడియోను ప్లే చేశారు. నరేష్‌కు అన్యాయం జరగలేదని, అతడిని గేమ్‌లో ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ఇక్కడితో ఆగకుండా నరేష్‌ను నాగార్జున ప్రశంసించారు. అతడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ ‘గోల్డ్’, ‘ప్లాటినం’, ‘ఎవరెస్ట్’ వంటి పదాలతో పొగిడారు నాగ్.
OTT: ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్.. పెళ్లైన ప్రతిసారీ కోడలికి అదే గతి.. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది
నరేష్‌ను బాధపెట్టేలా మాట్లాడిన దేబ్జానీకి నాగార్జున మరోసారి గతంలో ఇచ్చిన సూచనలను గుర్తు చేశారు. సరదాగా మాట్లాడటం వేరు.. ఎదుటివాళ్లు బాధపడేలా కామెంట్ చేయడం వేరు అని స్పష్టం చేశారు. తన మాటల వల్ల నరేష్ బాధపడ్డాడని తెలుసుకున్న దేబ్జానీ సారీ చెప్పింది. మిథిలేష్‌ను జిమ్ ట్రైనర్‌గా మాత్రమే పనికొస్తాడని కామెంట్ చేయడం, అమన్‌ను బచ్చా అని పిలవడం వంటి విషయాలపై ముఖేష్‌ను నాగార్జున ప్రశ్నించారు. మిథిలేష్‌ను వర్షిణి ప్రశంసించడం వల్లే ముఖేష్‌లో జెలసీ వచ్చిందా.? అని కూడా అడిగారు. అయితే తాను అలా ఫీల్ కాలేదని ముఖేష్ చెప్పాడు. ఇక కన్నింగ్ అంటూ వచ్చిన కామెంట్లకు ఎక్కువగా స్పందించకుండా తన గేమ్‌పై దృష్టి పెట్టాలని రామ్ ప్రసాద్‌కు నాగార్జున సూచించారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా ఆటలోనూ తనను తాను మెరుగుపరుచుకోవాలని చెప్పారు. వర్షిణి, అమన్ మధ్య జరిగిన గేమ్‌పై కూడా నాగార్జున స్పందించారు. ఇద్దరి వైపు నుంచి కావాలని జరిగిన తప్పిదం కాదని స్పష్టం చేశారు. అయితే ఆట తర్వాత వర్షిణి చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం సరైనవి కాదని నాగార్జున పేర్కొన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ సమానమేనని చెప్పారు. ఆటలో ఎవరికైనా అసౌకర్యంగా అనిపిస్తే గేమ్‌ను ఆపే అవకాశం ఉంటుందని వివరించారు. అదే సమయంలో సంచాలకుడి నిర్ణయంపై ఇతరులు మధ్యలో జోక్యం చేసుకోవడం కూడా అవసరం లేదని రోహిత్‌కు సూచించారు.
మహేష్ బాబు, ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




