IND vs WI: భారత్ – వెస్టిండీస్ తొలి వన్డే.. గ్రీన్‌ఫీల్డ్ పిచ్ ఎలా ఉంది? వాతావరణం ఏం చెబుతోంది?
IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు నేడు తెరలేవనుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీతో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్ పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు ఎలా సహకరిస్తుంది? వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారుతుందా? తాజా పిచ్ రిపోర్ట్, వాతావరణ అప్‌డేట్ తెలుసుకుందాం.

IND vs WI: భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ క్రికెట్ జట్టుతో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 27) తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన ఆకిబ్ నబీ డార్‌తో పాటు నమన్ ధీర్ తొలిసారిగా వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఈ మ్యాచ్‌లో శుభమన్ గిల్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్ నాయకత్వం వహిస్తున్నారు. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హెడ్-టూ-హెడ్ రికార్డుల్లో టీమిండియాదే పైచేయి
ఇరు జట్ల మధ్య వన్డే చరిత్రను పరిశీలిస్తే భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు మొత్తం 142 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా 72 మ్యాచ్‌లలో విజయం సాధించి బలమైన స్థితిలో ఉంది. మరోవైపు వెస్టిండీస్ జట్టు 64 మ్యాచ్‌లలో భారత్‌ను ఓడించింది. రెండు మ్యాచ్‌లు టై కాగా, మరో నాలుగు మ్యాచ్‌లలో ఎలాంటి ఫలితం తేలలేదు. ఈ గణాంకాలను బట్టి వన్డేల్లో భారత్ పైచేయి సాధించినప్పటికీ, కరీబియన్ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
గ్రీన్ ఫీల్డ్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది?
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటర్లు, బౌలర్లకు సమానమైన సహకారాన్ని అందిస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో కొత్త బంతితో పేస్ బౌలర్లు వికెట్లు తీసే అవకాశం ఉంది, ఇక్కడ సీమ్ మూవ్‌మెంట్ లభిస్తుంది. అయితే క్రీజులో కుదురుకున్న తర్వాత బ్యాటర్లకు పరుగులు చేయడం సులభం అవుతుంది. కొత్త బ్యాటర్లకు తొలుత బౌలర్లు కొంత ఇబ్బంది పెట్టవచ్చు, కానీ ఒకసారి సెట్ అయితే మాత్రం బౌలర్లపై భారీగా పరుగులు రాబట్టే అవకాశం ఉంది. స్పిన్నర్లకు కూడా మ్యాచ్ మధ్య ఓవర్లలో కొంత టర్న్ లభించే ఛాన్స్ ఉంది.
మ్యాచ్ సమయం, లైవ్ ప్రసార వివరాలు
భారత్ మరియు వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే ఈ తొలి వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్ ప్రారంభానికి అర్ధగంట ముందు, అనగా మధ్యాహ్నం 1:30 గంటలకు టాస్ పడుతుంది. ఈ ఉత్కంఠభరితమైన పోరును స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో JioHotstar యాప్, వెబ్‌సైట్ ద్వారా మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించవచ్చు.
టీమిండియా జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ.
వెస్టిండీస్ వన్డే జట్టు
షాయ్ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జంగూ, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, విటెల్ లావెస్, గుడాకేశ్ మోతీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
