Tigers: అడవుల్లో పులులను ఎలా లెక్కిస్తారు..? టైగర్ గోళ్లకు డీఎన్‌ఏ పరీక్ష.. ఎన్నో ఆసక్తికర విషయాలు

Tigers: దేశంలో పులల సంఖ్య అంతరించిపోతోంది. పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతుంటారు అధికారులు. అయితే 1913లో ప్రపంచంలో లక్ష పులులు ఉండగా..

Tigers: అడవుల్లో పులులను ఎలా లెక్కిస్తారు..? టైగర్ గోళ్లకు డీఎన్‌ఏ పరీక్ష.. ఎన్నో ఆసక్తికర విషయాలు
Follow us

|

Updated on: Sep 18, 2022 | 8:55 AM

Tigers: దేశంలో పులల సంఖ్య అంతరించిపోతోంది. పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతుంటారు అధికారులు. అయితే 1913లో ప్రపంచంలో లక్ష పులులు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 3 వేల లోపే ఉండటం పరిస్థితి ఏ మేరకు దాపురించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ వందేళ్లలో 90 శాతంకుపైగా పులులు అంతరించిపోయాయి. అడవుల నరికివేత, పులలను వేటాడటం కారణంగా వన్య ప్రాణులు అంతరించితపోతున్నాయని వణ్యప్రాణుల నిపుణులు చెబుతున్నమాట. కాగా, 2010లో ప్రపంచ వ్యాప్తంగా 3200 పులులు ఉండగా, 2020 ఏడాది నాటికి ఆ సంఖ్య 3900కి చేరింది. పులుల జనాభాలో పెరుగుదల సుమారు 22శాతం ఉందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రపంచంలో 690 పులులు పెరుగగా, ఒక్క భారత్ లోనే వాటి సంఖ్య 500 పెరగడం విశేషం. ప్రపంచంకెల్లా ఎక్కువ పులులు ఉన్న దేశ మనదేశమే.

వన్య ప్రాణుల గణాంక ఎలా జరుగుతుంది..?

ఇవి కూడా చదవండి

వన్యప్రాణుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. అటవీ సిబ్బంది రోజూ సుమారు నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పులులతో పాటు ఇతర వన్యప్రాణుల ఆధారాలను అన్వేషిస్తారు అటవీ శాఖ అధికారులు.

ఐదు పద్దతుల్లో వీటి గణాంకాలు:

భారత్‌లో నాలుగేళ్లకోసారి పులులను లెక్కిస్తుంటారు. సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గణన కొనసాగుతుంది. ఐదు పద్దతుల్లో వీటి గణాంకాల సేకరణ జరుగుతుంది. అటవీ సిబ్బంది నడిచే మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే వాటి గుర్తులతో పాటు ఏ ప్రదేశంలో ఎంత సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుంటారు. పగ్ మార్క్ విధానంలో సిబ్బంది అడవిలో నడుచుకుంటూ పులుల పాదముద్రలను గుర్తిస్తారు.

పులి పాదముద్రను బట్టి వయసు నిర్దారణ:

మొదటగా ఒక గాజుపలకపై స్కెచ్ పెన్ తో పాదముద్ర ఆకారాన్ని గీస్తారు. తర్వాత గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చూస్తారు. నేలపై పాదముద్ర చుట్టూ ఓ రింగ్‌ను ఏర్పాటు చేసి పాదముద్రపై చాక్ పౌడర్ చల్లుతారు. ఆ తర్వాత రింగ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని వేస్తారు. దాదాపు ఓ 20 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం గడ్డకట్టి పాదముద్ర అచ్చులా ఏర్పడుతుంది. పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించినది నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనేదాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు.

పులి ఆరోగ్య పరిస్థితిని ఎలా గుర్తిస్తారు..?

అడవుల్లో కనిపించే పులుల మలాన్ని సేకరించి, సిలికాన్ జెల్ ఉన్న డబ్బాలో పెట్టి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)కి పంపిస్తారు. అక్కడ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్యతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు.

గోళ్లకు డీఎన్‌ఏ పరీక్ష:

ఇక అడవి జంతువులకు చెట్లకు, రాళ్లకు వాటి పాదాలను, శరీరాన్ని రుద్దుకుంటాయి. గోళ్లు పెరిగినప్పుడు వాటిని తగ్గించుకునేందుకు శరీరంపై రురదను పోగొట్టుకునేందుకు ఇలా చేస్తుంటాయని, అప్పుడు వాటి వెంట్రుక‌లు, గోళ్లు ఊడిపోతుంటాయ‌ని అధికారులు చెబుతున్నారు. అట‌వీ సిబ్బంది చెట్లు, రాళ్లపై ప‌డ్డ గాట్లను ప‌రిశీలించి అక్కడ సంచ‌రించిన జంతువు ఏదో గుర్తించ‌గ‌లుగుతారు. సేక‌రించిన వెంట్రుక‌లు, గోళ్లకు డీఎన్ఏ ప‌రీక్ష చేసి ఆ జంతువు ఏద‌న్నది నిర్ధారిస్తారు.

గిన్నిస్ రికార్డులకు ఎక్కిన భారత పులుల గణన

భారతదేశంలో పులుల లెక్కింపు విధానం 2020లో కొత్త గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. కెమెరాల సహాయంతో వన్యప్రాణి గణన ఇంత పెద్ద ఎత్తున ఇంకెక్కడా లేకపోవడంతో ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కు ఎక్కింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..