WhatsApp: వాట్సాప్‌లో నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ పంపాలా? ఇదిగో ఇది ట్రై చేయండి..

ఓ సమస్య మాత్రం వాట్సాప్ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. అదేంటంటే ఏదైనా కొత్త నంబర్ కు మెసేజ్ చేయాలంటే కుదరదు. తప్పనిసరిగా ఆ నంబర్ ఫోన్ కాంటాక్ట్ లలో సేవ్ చేయాలి. కానీ ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది.

WhatsApp: వాట్సాప్‌లో నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ పంపాలా? ఇదిగో ఇది ట్రై చేయండి..
Whatsapp
Follow us

|

Updated on: May 26, 2023 | 5:30 PM

ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్ లో నంబర్ వన్ వాట్సాప్. కేవలం ఇండియాలో మాత్రమే కాక, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్ గ్లోబల్ లీడర్ గా అవతరించింది. వినియోగదారుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సరికొత్త అప్ డేట్లను అందిస్తోంది. స్నేహితులు, బంధువులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార వేత్తలు ఎవరైనా సమాచార మార్పిడికి వాట్సాప్ నే ఆధారంగా చేసుకుంటున్నాయి. అయితే ఎన్ని కొత్త అప్ డేట్లు వచ్చినా.. ఓ సమస్య మాత్రం వాట్సాప్ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. అదేంటంటే ఏదైనా కొత్త నంబర్ కు మెసేజ్ చేయాలంటే కుదరదు. తప్పనిసరిగా ఆ నంబర్ ఫోన్ కాంటాక్ట్ లలో సేవ్ చేయాలి. అప్పుడు ఆ నంబర్ కు మెసేజ్ చేయడం కుదురుతుంది. అయితే ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది. కాంటాక్ట్ సేవ్ చేయకుండానే మెసేజ్ చేసేయొచ్చు. అదేలాగో తెలుసుకుందాం రండి..

థర్డ్ పార్టీ సొల్యూషన్..

వాట్సాప్ లో ఏదైనా కొత్త నంబర్ కు మెసేజ్ చేయడానికి ఆ నంబర్ ఫోన్ కాంటాక్ట్ లో సేవ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే అందుకోసం మీరు థర్డ్ పార్టీ లింక్ చేయాల్సి ఉంటుంది.

  • మొదటిగా మీరు వెబ్ బ్రౌజర్ లోకి వెళ్లి http://wa.me/91XXXXXXXXXX ఈ లింక్ ని పేస్ట్ చేయాలి. ఇక్కడ ఇన్ టూ ఉన్న స్థానంలో మీరు మెసేజ్ పంపాలనుకొంటున్న ఫోన్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మీకు `కంటిన్యూ టు చాట్` అనే ఆప్షన్ వస్తుంది. అది కాకుండా ఓపెన్ వాట్సాప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ మెసేజ్ కంపోస్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయాలి. అంతే ఇక ఆ తర్వాత ఎన్ని మెసేజ్ లు అయినా చేసుకోవచ్చు.
  • ఈ మెసేజ్ అన్ని ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుంది. కాబట్టి వ్యక్తుల ప్రైవసీ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

మరో ఆప్షన్..

ఫోన్ నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయడానికి మరో ఆప్షన్ కూడా ఉంది. అందుకోసం మీరు క్లిక్ టు చాట్ అనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది వాట్సాప్ అనధికారికంగా అందిస్తున్న అవకాశం అని గుర్తించాలి. దీని ద్వారా సులభంగా నంబర్లకు మెసేజ్ చేసేయొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..