Philips Air Fryer: చుక్క నూనె లేకుండా మీ వంట తయారు.. సరికొత్త ఎయిర్ ఫ్రైయర్‌ను లాంచ్ చేసిన ఫిలిప్స్..

తాజాగా నూనె అవసరం లేకుండా చేసేందుకు ఎయిర్ ఫ్రైయర్‌ను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు.  ప్రముఖ కంపెనీ ఫిలిప్స్ భారతదేశంలో కొత్త ఎయిర్ ఫ్రైయర్‌ను ప్రారంభించడంతో దాని కిచెన్ ఉపకరణాల లైనప్‌ను విస్తరించింది. ఈ కంపెనీ క్రోమా సహకారంతో, దాని కొత్త సీ-త్రూ కుకింగ్ విండో ఎయిర్ ఫ్రైయర్‌ను ప్రకటించింది.

Philips Air Fryer: చుక్క నూనె లేకుండా మీ వంట తయారు.. సరికొత్త ఎయిర్ ఫ్రైయర్‌ను లాంచ్ చేసిన ఫిలిప్స్..
Airfryer
Follow us

|

Updated on: May 26, 2023 | 5:15 PM

సాధారణంగా ఉరుకుల పరుగుల జీవితంలో వంట అనేది పెద్ద ప్రహసనంలా మారింది. అయితే పెరుగుతున్న గ్యాస్ ధరలు కూడా వంటను మరింత ప్రియం చేస్తున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వంట సామగ్రి హవా కూడా నడుస్తుంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, ఇండక్షన్ సౌవ్వ్, మైక్రో వేవ్ఒవెన్ వంటివి ప్రజాధరణ బాగా పొందాయి. తాజాగా నూనె అవసరం లేకుండా చేసేందుకు ఎయిర్ ఫ్రైయర్‌ను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు.  ప్రముఖ కంపెనీ ఫిలిప్స్ భారతదేశంలో కొత్త ఎయిర్ ఫ్రైయర్‌ను ప్రారంభించడంతో దాని కిచెన్ ఉపకరణాల లైనప్‌ను విస్తరించింది. ఈ కంపెనీ క్రోమా సహకారంతో, దాని కొత్త సీ-త్రూ కుకింగ్ విండో ఎయిర్ ఫ్రైయర్‌ను ప్రకటించింది. ఈ ఎయిర్ ఫ్రైయర్‌లో ఎంతమేర్ ఫ్రై అయ్యిందో తెలుసుకునేందుకు ఒక సీ-త్రూ విండోతో వస్తుంది. ఈ ఫీచర్ వంట చేసేటప్పుడు వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ఆహారం ఎక్కువగా ఉడకకుండా లేదా కాల్చకుండా నిరోధించవచ్చు. ఫిలిప్స్ ఎయిర్‌ఫ్రైయర్ హెచ్‌డీ 9257/80 ఇప్పుడు కీలక ఆధునిక ట్రేడ్ అవుట్‌లెట్‌లు, ఫిలిప్స్ డొమెస్టిక్ అప్లయెన్సెస్ ఇ-స్టోర్‌లో రూ. 15,995కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ ఫీచర్లు ఎలాం ఉన్నాయో? ఓ లుక్కేద్దాం.

కొత్త ఫిలిప్స్ ఎయిర్‌ఫ్రైయర్ హెచ్‌డీ9257/80 14-ఇన్-1 వంట ఫంక్షన్‌లతో వస్తుంది. ఇది వినియోగదారులు ఒకే పరికరాన్ని ఉపయోగించి ఫ్రై, బేక్, గ్రిల్, రోస్ట్, డీహైడ్రేట్, టోస్ట్, డీఫ్రాస్ట్, రీహీట్ మరియు మరిన్నింటిని అనుమతిస్తుంది. ఫిలిప్స్ కూడా సీ-త్రూ విండోతో వచ్చిన మొదటి ఎయిర్ ఫ్రైయర్ అని పేర్కొంది. ఫిలిప్స్ ఎయిర్‌ఫ్రైయర్ హెచ్‌డీ 9257/80 నిర్దిష్ట రకాల వంటల కోసం 7 ప్రీసెట్‌లతో టచ్ స్క్రీన్‌తో వస్తుంది, పైన డిజిటల్ టచ్ డిస్‌ప్లే, రాపిడ్ ఎయిర్ టెక్నాలజీ ఆహారాన్ని బయట స్ఫుటంగా, లోపలి భాగంలో తక్కువ లేదా అదనపు నూనె లేకుండా మృదువుగా చేస్తుంది. ఎయిర్ ఫ్రైయర్ న్యూట్రి యాప్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది ఎయిర్‌ఫ్రైయర్‌ల కోసం కొత్త వంటకాలను అన్వేషించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.  ఫిలిప్స్ 10 సంవత్సరాల క్రితమే ఎయిర్‌ఫ్రైయర్‌తో భారతీయ వినియోగదారులను పలుకరించిందన కంపెనీ ప్రతినిధులు చెబుతన్నారు. ప్రస్తుతం మారిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఎంచుకోవడం ద్వారా వారి జీవనశైలిలో సానుకూల మార్పు తీసుకురావాలని చూస్తున్న వారికి ఈ ఎయిర్ ఫ్రైయర్ మంచి ఎంపికగా ఉంటుందని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..