Hammer Earbuds: హుషారెత్తించే సౌండ్ క్లారిటీతో హమ్మర్ ఇయర్ బడ్స్.. అతి తక్కువ ధరలోనే..
టెక్నాలజీ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న సంస్థ హమ్మర్. అత్యాధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా మూడు ఇయర్ బడ్స్ తో పాటు ఓ స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో విడుదల చేసింది.
టెక్నాలజీ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న సంస్థ హమ్మర్. అత్యాధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా మూడు ఇయర్ బడ్స్ తో పాటు ఓ స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఎయిర్ ఫ్లో ప్లస్, హమ్మర్ కో మినీ, హమ్మర్ జీ షాట్స్ పేరుతో ఇయర్ బడ్స్.. పల్స్ ఎక్స్ పేరుతో స్మార్ట్ వాచ్ ను హమ్మర్ లాంచ్ చేసింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హమ్మర్ ఎయిర్ ఫ్లో ప్లస్.. ఈ ఇయర్ బడ్స్ లో వీ5.1 బ్లూ టూత్ ఉంటుంది. ఐపీ4 రేటెడ్ వాటర్, స్వెట్ రెసిస్టెన్స్ ఉంటుంది. 13ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. ఈ ఇయర్ బడ్స్ 23 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ అందిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది. దీనిలో స్మార్ట్ టచ్ కంట్రోల్ ఉంటుంది. రోడ్డుల వెళ్తున్నప్పుడు కూడా క్లియర్ సౌండ్ ఈ ఇయర్ బడ్స్ అందిస్తాయని, వాయిస్ అసిస్టెంట్స్(గూగుల్,సిరి) కి సపోర్టు చేసింది. వీటి ధర రూ. 999గా ఉంది.
హమ్మర్ కో మినీ.. ఈ వైర్ లెస్ ఇయర్ ఫోన్లు లైట్ వెయిట్ తో ఉంటాయి. డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అవుట్ డోర్ అవసరాలకు అనుగుణంగా మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది. ఐపీ4 రేటింగ్ తో వాటర్, స్వెట్ రిసిస్టెన్స్ ఉంటుంది. 200ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ.999గా ఉంది.
హమ్మర్ జీ షాట్స్.. ఈ ఇయర్ బడ్స్ నాయిస్ రిడక్షన్, లో లైటింగ్, 50 మిల్లి సెకండ్ల అల్ట్రా లో ల్యాటెన్స్ ఉంటుంది. స్పూతర్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్లారిటీని అందిస్తోంది. దీనికి కూడా ఐపీ4 రేటింగ్ తో వాటర్, స్వెట్ రెసిస్టెంట్ వస్తుంది. 22 గంటల బ్యాటరీ రన్ టైం ఉంటుంది. గూగుల్, సిరి వాయిస్ అసిస్టెంట్స్ సపోర్టు చేస్తుంది. దీన ధర రూ. 1799గా ఉంది.
పల్స్ ఎక్స్ స్మార్ట్ వాచ్..
ఈ స్మార్ట్ వాచ్ లో 1.83 అంగుళాల ఐపీఎస్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది అతి తక్కువ బెజెల్, 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో డిస్ ప్లే ను అందిస్తుంది. ఈ పల్స్ ఎక్స్ స్మార్ట్ వాచ్ లో జీపీఎస్ సపోర్టు ఉంటుంది. ట్రాక్ స్టెప్స్, క్యాలరీస్ బర్న్, హార్ట్ రేట్, వైటల్ సైన్స్ వంటి హెల్త్ ట్రాకర్లు ఉంటాయి. ఇది ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్ లను సపోర్టు చేస్తుంది. దీనిలో 55 స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. ఐపీ7 రేటెడ్ వాటర్, డస్ట్ రిసిస్టెన్స్ ఉంటుంది. దీన ధర రూ. 1,699గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..