Nonstop Cooking: గరిట తిప్పింది.. గిన్నీస్‌ రికార్డుకెక్కింది! కాకపోతే 4 రోజులు నాన్‌స్టాప్‌ వంటచేసింది

నైజీరియాకు చెందిన ఓ మహిళా చెఫ్ నాన్​స్టాప్‌గా ​100 గంటల పాటు వంట చేసి సోమవారం (మే 15) గిన్నీస్‌ రికార్డు బ్రేక్‌ చేసింది. ఇప్పటి వరకు భారత చెఫ్ లతా టాండన్‌ అనే మహిళ (2019) పేర ఉన్న 87 గంటల 45 నిమిషాల రికార్డును నైజీరియన్ చెఫ్‌ తిరగరాసింది...

Nonstop Cooking: గరిట తిప్పింది.. గిన్నీస్‌ రికార్డుకెక్కింది! కాకపోతే 4 రోజులు నాన్‌స్టాప్‌ వంటచేసింది
Nigerian Chef Sets World Record
Follow us

|

Updated on: May 16, 2023 | 4:24 PM

నైజీరియాకు చెందిన ఓ మహిళా చెఫ్ నాన్​స్టాప్‌గా ​100 గంటల పాటు వంట చేసి సోమవారం (మే 15) గిన్నీస్‌ రికార్డు బ్రేక్‌ చేసింది. ఇప్పటి వరకు భారత చెఫ్ లతా టాండన్‌ అనే మహిళ (2019) పేర ఉన్న 87 గంటల 45 నిమిషాల రికార్డును నైజీరియన్ చెఫ్‌ తిరగరాసింది.

నైజీరియాకు చెందిన హిల్దా బాసి అనే మహిళ గత గురువారం నుంచి నాన్​స్టాప్‌గా వంద గంటల పాటు ఆమె వంట చేసింది. లండన్ కాలమానం ప్రకారం.. గత గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వంట చేయడం ప్రారంభించిన బాసి సోమవారం రాత్రి 7.45కు వంద గంటలకు వంట పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. ఇన్ని గంటలసేపూ ఏం వండిందా..? అనేకదా అనుమానంగా చూస్తున్నారు. ఒక్కటేమిటి నైజీరియా ప్రత్యేక వంటకాలన్నింటినీ చేసేసింది. సూప్‌లు, టొమాటో రైస్ వంటి పలు డిష్‌లు తయారు చేసింది. 12 గంటలు నాన్​స్టాప్ వంట చేసి, ఓ గంట సేపు విశ్రాంతి తీసుకునేది. ఆ గంట సమయంలోనే స్నానం, మెడికల్ చెకప్‌లు పూర్తి చేసుకునేది. ఇలా రాత్రింబగళ్లు కష్టించి వంద గంటలు వంట చేసి దేశంలో సెన్సేషన్‌గా మారింది బాసి. లెక్కి ప్రాంతంలో ఆమె రికార్డు కోసం చేస్తున్న ప్రయత్నాన్ని వీక్షించేందుకు వేలాది మంది తరలివచ్చారు. పాటలు పాడుతూ ఆమెను ప్రోత్సహించారు. వంద గంటలు పూర్తి కాగానే అభినందనలతో బాసిని ముంచెత్తారు. ఆన్‌లైన్‌లోపూ ఆమె వంటల ప్రోగ్రాంను లైవ్‌ ప్రసారం చేశారు. రికార్డు నెలకొల్పగానే నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ సైతం బాసిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ఆడవారి సంకల్ప బలం చాటిచెప్పేందుకే ఈ సుదీర్ఘ వంటల కార్యక్రమాన్ని చేపట్టినట్లు బాసి తెల్పింది. ఆఫ్రికా సమాజంలో సరైన ప్రాధాన్యం పొందలేకపోతున్న మహిళలకు సంఘీభావంగా ఈ రికార్డు నెలకొల్పినట్లు వివరించింది. తన ప్రయత్నం ద్వారా నైజీరియా యువత సంకల్పం గురించి ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్నట్లు మీడియాకు తెల్పింది. ఇక అన్ని గంటలపాటు చేసిన వంటలను అక్కడకు చూడటానికి వచ్చిన వారికి ఫ్రీగా వడ్డించింది బాసి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.