Hand Burns: వంట చేసే సమయంలో మీ చేయ్యి కాలిందా..? అయితే ఇలా అస్సలు చేయకండి..!
మహిళలు వంట గదిలో చాలా సేపు గడుపుతుంటారు. ఎందుకంటే ఇంటి సభ్యులందరికి వంట చేసి పెట్టడం, రకరకాల వంటకాలను చేయడం జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాలలో మహిళలు పని ఒత్తిడి పెరిగి ఇబ్బంది..
మహిళలు వంట గదిలో చాలా సేపు గడుపుతుంటారు. ఎందుకంటే ఇంటి సభ్యులందరికి వంట చేసి పెట్టడం, రకరకాల వంటకాలను చేయడం జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాలలో మహిళలు పని ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడుతుంటారు. వంట సమయం ఆలస్యం అవుతున్న సమయంలో కంగారు పడుతుంటారు. అలాంటి సమయంలో చాలా మంది మహిళలు చేతులను కాల్చుకోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాము. చేతులు కాలిన సమయంలో వారికి ఉండే మంట అంతా ఇంతా కాదు. ఇలా మహిళలు చాలా సార్లు చేతులు కాల్చుకుంటుంటారు.
ఇలా కాలడం వల్ల మహిళలు చికాకు పడుతుంటారు. అలాగే ఈ సమస్య మహిళల్లోనే కాకుండా పురుషుల్లో కూడా అప్పుడప్పుడు ఉంటుంది. పురుషులు కూడా కాల్చుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆ కాలిన చోట మంట నొప్పి భరించలేనంతగా ఉంటుంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. టూత్ పేస్ట్ వంటివి ఉపయోగిస్తుంటారు. వీటివల్ల ఎన్నో దుష్ప్రభావాలు కూడా వస్తాయి. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అవేంటో ఒసారి తెలుసుకుందాం.
- కాలిన చోట మంట రాకుండా ఉండాలంటే చర్మంపై ఐస్ ముక్కతో రుద్దడం మంచిది. ఇది చికాకు నుంచి కూడా బయటపడే విధంగా చేస్తుంది. ఇలా ఐస్ ముక్కతో రుద్దడం వల్ల చర్మంపై కాలిన భాగాన చల్లబడుతుంది.
- ఇంకో విషయం ఏంటంటే.. కాలిన చోట టూత్ పేస్ట్ రాయడం వల్ల కాస్త చల్లబరుస్తుంది. కానీ టూత్‌పేస్ట్ చర్మ రంద్రాలను నిరోధిస్తుంది. దీనివల్ల మంట తొందరగా తగ్గదు.
- ఒకవేళ కాలిన తరువాత చర్మంపై బొబ్బలు లేదా పొక్కులు వచ్చినట్లయితే అవి పగలకుండా కేవలం డ్రెస్సింగ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.
- కాలిన చోట సూర్యరశ్మి కిరణాలు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఇలా చేసినట్టయితే సూర్యుని నుంచి వెలువడే కొన్ని హానికరమైన కిరణాల కారణంగా కాలిన చోట కాస్త చికాకుగా అనిపిస్తుంటుంది. దీనివల్ల చర్మంపై పొక్కులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకు కాలిన సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి