AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram: వాట్సాప్‌లో లాస్ట్ సీన్ హైడ్ చేసినట్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చేయొచ్చు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..

సాధారణంగా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫారం అయినా ఆ యాప్ లో మీరు ఉంటే అది యాక్టివిటీ స్టేటస్ ను చూపిస్తుంది. అంటే ఆన్ లైన్లో ఉన్నట్లు చూపిస్తుంది. మరి దానిని హైడ్ చేయాలంటే ఎలా? ఆన్ లైన్ అని కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? అత్యంత జనాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ ను ఎలా వినియోగించుకోవాలో చూద్దాం..

Instagram: వాట్సాప్‌లో లాస్ట్ సీన్ హైడ్ చేసినట్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చేయొచ్చు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..
Instagram
Madhu
|

Updated on: Aug 29, 2023 | 5:00 PM

Share

సోషల్ మీడియా.. మనిషి లేచిన దగ్గర నుంచి తిరిగి బెడ్ పైకి చేరే వరకూ ఎక్కువ సమయం గడిపేది దీనిలోనే, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ అని, ట్విట్టర్ అని రకరకాల ప్లాట్ ఫారంలలో గడుపుతుంటారు. కొంత మంది స్నేహితులతో చాటింగ్ చేస్తుంటారు. మరికొంత మంది సమాచారం కోసం ఫీడ్ చూస్తుంటారు. కొంతమంది రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అయితే చాలా మంది తాము ఈ సోషల్ మీడియాలో ఉన్నా కూడా యాక్టివిటీ స్టేటస్ కనిపిపంచకూడదని భావిస్తారు. అంటే తాము సోషల్ మీడియాలో ఉన్నా కూడా వేరే వ్యక్తికి తెలియకూడాదనుకుంటారు. సాధారణంగా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫారం అయినా ఆ యాప్ లో మీరు ఉంటే అది యాక్టివిటీ స్టేటస్ ను చూపిస్తుంది. అంటే ఆన్ లైన్లో ఉన్నట్లు చూపిస్తుంది. మరి దానిని హైడ్ చేయాలంటే ఎలా? ఆన్ లైన్ అని కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? అత్యంత జనాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ ను ఎలా వినియోగించుకోవాలో చూద్దాం..

ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివిటీ స్టేటస్..

ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివిటీ స్టేటస్ అనేది వ్యక్తులను అకౌంట్లను ఫాలో అవడానికి, అలాగే వారు ఆన్ లైన్లో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫేస్ బుక్ మెస్సేంజర్, వాట్సాప్ లలో ఉండే ఫీచర్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో మీ ప్రైవసీని మీరు కాపాడుకోవచ్చు. మీరు యాప్ లో ఉన్నారో లేదో అంటే ఆన్ లైన్ లో ఉన్నారో లేదో బయటి వ్యక్తులకు తెలియకుండా కాపాడుతుంది. మరి అలాంటి ఫీచర్ ఎలా వినియోగించాలి? యాక్టివిటీ స్టేటస్ ను డిజేబుల్ చేయడం ఎలా? తెలుసుకుందాం రండి..

ఇవి కూడా చదవండి
  • మొదటిగా మీరు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ ఓపెన్ చేయాలి.
  • దానిలో మీ ప్రొఫైల్ ని యాక్సెస్ చేసేందుకు యాప్ లో కుడిచేతి వైపు కింద ఉన్న ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.
  • ప్రొఫైల్ పేజీలో కుడి చేతి వైపు పైన ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయాలి. వచ్చిన ఆప్షన్లలో నుంచి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ లోకి వెళ్లాలి.
  • దానిలో మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్ సెక్షన్ లోకి వెళ్లి షో యాక్టివిటీ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దానిని స్విచ్ ను ఆఫ్ చేసేయాలి.
  • అలా చేస్తే మీరు యాప్ ఉన్నప్పటికీ మీ స్టేటస్ చూపించదు. దీని ద్వారా మీ ఆన్ లైన్ స్టేటస్ బయటి వ్యక్తులకు కనిపించదు. మీ ప్రైవసీ భద్రంగా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..