Aadhaar Card: మీ ఆధార్ కార్డు భద్రమేనా? ఎవరైనా మీకు తెలియకుండా వాడుతున్నారా? ఇలా సులభంగా తెలుసుకోండి..
మనకు ఆధార్ అనేది చాలా ప్రధానమైన గుర్తింపు పత్రం. అది దుర్వినియోగం అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొచ్చింది. మీ ఆధార్ కార్డును ఎవరైనా, ఎప్పుడైనా వినియోగించారమో తెలుసుకునేందుకు యూఐడీఏఐ వెబ్ పోర్టల్లో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే ఆధార్ యూసేజ్ హిస్టరీ.

మన దేశంలో ఆధార్ కార్డే అన్నింటికీ ఆధారం. అది లేకపోతే ఏ పని చేయలం. కనీసం బ్యాంకు ఖాతా కూడా ఓపెన్ చేయలేం. ఏ ప్రభుత్వ పథకం కూడా మంజూరు కాదు. అలాగే ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా ఆధార్ అవసరమే. అటువంటి ఆధార్ ను భద్రంగా కాపాడుకోవడం కూడా చాలా అవసరమే. లేకుంటే దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆధార్ ఓటీపీ సాయంతోనే చాలా వరకూ కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఒకవేళ మీ ఆధార్‌ను ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే, దానిని దుర్వినియోగం చేస్తే, అది మీరు చేయలేదని నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల ముందు జాగ్రత్త చాలా అవసరం. అందుకే మీ ఆధార్ భద్రతను తనిఖీ చేసుకోవాలి. దాని కోసం మీకు ఓ ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే ఆధార్ కార్డ్ యూసేజ్ హిస్టరీ. దీని ద్వారా మీ ఆధార్ కార్డును ఎప్పుడు, ఎక్కడ, ఎలా, దేని కోసం వినియోగించారు అనేది తెలుస్తుంది. దీనిని ఎలా తెలుసుకోవాలో ఇప్పడు చూద్దాం..
మనకు ఆధార్ అనేది చాలా ప్రధానమైన గుర్తింపు పత్రం. అది దుర్వినియోగం అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొచ్చింది. మీ ఆధార్ కార్డును ఎవరైనా, ఎప్పుడైనా వినియోగించారమో తెలుసుకునేందుకు యూఐడీఏఐ వెబ్ పోర్టల్లో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే ఆధార్ యూసేజ్ హిస్టరీ. దీనిని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఆధార్ కార్డు వినియోగ చరిత్రను ఇలా తెలుసుకోవచ్చు..
- ముందుగా మీరు ఆధార్ కార్డు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- దానిలో మై ఆధార్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ కింద మీకు ఆధార్ అథంటికేషన్ హిస్టరీ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది. దానిలో మీ 12 అంకెలతో కూడిన ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి. వెంటనే కింద సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే మీకు మీ ఆధార్ కార్డు హిస్టరీ డౌన్ లోడ్ అవుతుంది.
క్షుణ్ణంగా తనిఖీ చేయాలి..
ఈ ఆధార్ హిస్టరీని క్షుణ్ణంగా తనికీ చేయాలి. ఏదైనా సరికానీ సమాచారం కనిపిస్తే వెంటనే ఆధార్‌కేంద్రాన్ని సందర్శించాలి. గుర్తించిన వ్యత్యాసాలను వారికి తెలియజేయాలి. ఒకవేళ మీ ఆధార్ దుర్వినియోగం చేసినట్లు అనుమానం కలిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1947 లేదా help@uidai.gov.inకి ఈ-మెయల్ ద్వారా వీలైనంత త్వరగా యూఐడీఏఐకి ఫిర్యాదు చేయొచ్చు.




మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..