Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: జూలైలో 72 లక్షల వాట్సప్ ఖాతాలు బ్యాన్.. భారతదేశంలో ఆన్‌లైన్ మోసాలపై మెటా కీలక నిర్ణయం..

సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ కీలక ప్రకటన విడుదల చేసింది. జూలై నెలలో తమ ప్లాట్‌ఫారమ్ నుంచి 72 లక్షల భారతీయ ఖాతాలను బ్యాన్ చేస్తున్నట్లుగా తెలిపింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లుగా పేర్కొంది. యూజర్ సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లుగా కంపెనీ తెలిపింది. ప్లాట్‌ఫారమ్‌ను సురక్షితంగా ఉంచడానికి కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియజేసింది.

WhatsApp: జూలైలో 72 లక్షల వాట్సప్ ఖాతాలు బ్యాన్.. భారతదేశంలో ఆన్‌లైన్ మోసాలపై మెటా కీలక నిర్ణయం..
Whatsapp
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 05, 2023 | 1:36 PM

భారతదేశంలో ఆన్‌లైన్ స్కామ్‌లు గత రెండు నెలల్లో బాగా పెరిగాయి. చాలా మంది ఆందోళన చెందుతున్నారు. చాలా సందర్భాలలో.. స్కామర్‌లు వాట్సాప్ ద్వారా బాధితులను సంప్రదిస్తారు. మీరు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తాం.. ఈజీగా డబ్బు సంపాదించండి.. ఇలాంటి ప్రకటనలతో ముంచేస్తున్నారు.  ఉద్యోగ ఆఫర్‌తో వారిని ప్రలోభపెడుతున్నారు. ఇలాంటి కేసులు గతంలో చాలానే నమోదయ్యాయి. ఇప్పుడు కూడా మనం ఇలాంటి వార్తలను చాలా వింటూనే ఉన్నాం.

సోషల్ మీడియా కంపెనీలు ఐటి రూల్స్ 2021 ప్రకారం ప్రతి నెలా నెలవారీ యూజర్ సేఫ్టీ నివేదికను జారీ చేయాలి. జూలై నెలకు సంబంధించిన వాట్సాప్ సెక్యూరిటీ రిపోర్టు మెటా విడుదల చేసింది. కంపెనీ జూలైలో ప్లాట్‌ఫారమ్ నుంచి 72 లక్షల ఇండియన్ ఖాతాలను నిషేధించింది. జూలై 1 నుంచి 31 వరకు 72,28,000 వాట్సాప్ ఖాతాలను నిషేధించగా.. ఎలాంటి ఫిర్యాదు లేకుండానే 31,08,000 ఖాతాలను నిషేధించామని కంపెనీ తెలిపింది. కంపెనీ తన స్వంత పర్యవేక్షణలో ఈ ఖాతాలను నిషేధించింది.

జూలైలో చాలా ఫిర్యాదులు..

భారతదేశంలో 550 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది వాట్సప్. జూలై నెలలో  కంపెనీకి రికార్డు స్థాయిలో 11,067 ఫిర్యాదులు అందాయి. వాటిలో కంపెనీ 72పై చర్య తీసుకుంది. “ఎకౌంట్  ఆక్షన్డ్” అనేది రిపోర్టు ఆధారంగా కంపెనీ నివారణ చర్యలు తీసుకుంది. గతంలో నిషేధించబడిన ఖాతాను పునరుద్ధరించడం వంటి వాటిని సూచిస్తుంది. వాట్సాప్ అందించిన సమాచారం ప్రకారం, యూజర్ సేఫ్టీ రిపోర్ట్ కంపెనీకి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి. ప్లాట్‌ఫారమ్‌ను సురక్షితంగా ఉంచడానికి కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియజేసింది.

ఇది కాకుండా, జూలై 1 నుంచి జూలై 31 మధ్య అందిన ఫిర్యాదులను అప్పీలేట్ కమిటీ పరిష్కరించింది. వచ్చిన ఉత్తర్వులు ఐదు అని, పాటించిన ఉత్తర్వులు కూడా ఐదు అని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ కాకుండా, ఫేస్‌బుక్ నుంచి 21 మిలియన్ల తప్పుడు కంటెంట్‌లను జూలై 2023 నెలలో బ్లాక్ చేసినట్లుగా మెటా తెలిపింది. అలాగే, జూలై 2023లోనే, Instagram నుంచి 5.9 మిలియన్ చెడు కంటెంట్‌లు తొలగించబడ్డాయి.

ఇన్ని ఖాతాలు ఎందుకు నిషేధించబడ్డాయి?

కంపెనీ నిబంధనలు, షరతులకు వ్యతిరేకంగా ప్లాట్‌ఫారమ్‌లో యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను WhatsApp నిషేధిస్తుంది. మీరు వాట్సాప్‌లో అసభ్యకరమైన, చట్టవిరుద్ధమైన, పరువు నష్టం కలిగించే, బెదిరించడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం లేదా ఇతర తప్పుడు చర్యలకు పాల్పడితే.. కంపెనీ మీ ఖాతాను నిషేధించవచ్చు. మీ ఖాతా నిషేధించబడకూడదనుకుంటే.. కంపెనీ నిబంధనలు, షరతుల ప్రకారం మాత్రమే ఖాతాను నిర్వహించండి.

అంతర్జాతీయ నంబర్ నుండి కాల్ వస్తే, కాల్ చేస్తున్న వ్యక్తి వేరే దేశంలో ఉన్నారని అర్థం కాదు. WhatsApp కాల్‌లు ఇంటర్నెట్ ద్వారా వస్తోందని అర్థం చేసుకోవాలి. ఎవరైనా మీరు ఉన్న నగరంలోనే కూర్చున్నప్పటికీ.. WhatsApp ద్వారా అంతర్జాతీయ నంబర్ నుంచి కాల్ చేయవచ్చు. ఇలాంటివారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మెటా సూచించింది.

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి