- Telugu News Photo Gallery Technology photos Best Smartphone under 15k, Check here for Features and price details Telugu Tech news
Smart phone: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో స్టన్నింగ్ ఫోన్స్ ఇవే..
మార్కెట్లోకి రోజుకో కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా కొంగొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. మీరు కూడా కొత్త ఫోన్ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? మీ బడ్జెట్ రూ. 15 వేలులోపా.? అయితే మీ కోసమే ఈ బెస్ట్ కలెక్షన్స్. రూ. 15 వేలలోపు అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Sep 05, 2023 | 1:46 PM

తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గ్యాలక్సీ ఏ14 5జీ ఫోన్. ఈ ఫోన్ ధర రూ. 15,490గా ఉంది. ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ. 13,990గా ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు సెల్ఫీల కోసం 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 స్మార్ట్ ఫోన్ ధర రూ. 13,448గా ఉంది. ఈ ఫోన్‌లో 50 ఎంపీ రెయిర్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

రూ. 15 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో టెక్నో పొవా 5 ప్రో ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 14,999గా ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

బడ్జెట్ ఫోన్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఫోన్ ఐకూ జెడ్6 లైట్ 5జీ ఫోన్. ఈ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 14,495గా ఉంది. ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.





























