Android Phone: మీ ఫోన్ స్లోగా ఉందా.. అయితే ట్రిక్ పాటించండి.. స్టోరేజ్ కూడా పెరుగుతుంది..
ఈ కాష్ అనేది ఫోన్లో ఉండే తాత్కాలిక నిల్వ స్థలం. ఇది యాప్‌లు త్వరగా ఓపెన్ కావడానికి, యాక్సెస్ చేయడానికి అవసరమైన డేటాను నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ డేటాలో చిత్రాలు, వీడియోలు, వెబ్‌సైట్ ఫైల్‌లు వంటివి ఉంటాయి. మరి అలాంటప్పుడు కాష్ ను ఎందుకు క్లియర్ చేయాలి? దానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగిస్తున్నట్లు అయితే కాష్ మెమరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మెమరీ వృథా అవడంతో పాటు ఫోన్ పనితీరు కూడా నెమ్మదిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఈ ఫోన్ కాష్ ను డిలీట్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మీ ఫోన్‌లో యాప్స్ నెమ్మదిగా లోడ్ అవుతున్నా.. తరచుగా క్రాష్ అవుతూ ఉండటం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే, మొదట మీరు చేయాల్సింది మీ పరికరంలోని కాష్ కాష్‌ను క్లియర్ చేయడం. వాస్తవానికి ఈ కాష్ గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఈ కాష్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే తాత్కాలిక నిల్వ స్థలం. ఇది యాప్‌లు త్వరగా ఓపెన్ కావడానికి, యాక్సెస్ చేయడానికి అవసరమైన డేటాను నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ డేటాలో చిత్రాలు, వీడియోలు, వెబ్‌సైట్ ఫైల్‌లు వంటివి ఉంటాయి. మరి అలాంటప్పుడు కాష్ ను ఎందుకు క్లియర్ చేయాలి? దానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అవేంటి? వాటి వల్ల ప్రయోజనం ఏంటి? ఎలా క్లియర్ చేయాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కాష్‌ని ఎందుకు క్లియర్ చేయాలంటే..
పనితీరును మెరుగుపరచడానికి.. మీ ఫోన్లో కాష్‌ని క్లియర్ చేయడం వల్ల మీ ఫోన్ యాప్‌లను రన్ చేయడానికి ఉపయోగించే మెమరీ ర్యామ్ ఖాళీ అవుతుంది. ఇది మీ ఫోన్ మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రత్యేకించి ర్యామ్ తక్కువగా ఉన్న ఫోన్లకు ఇది బాగా ఉపకరిస్తుంది.
యాప్ సమస్యలను పరిష్కరించడానికి.. మీకు యాప్ క్రాష్ కావడం లేదా ఫ్రీజింగ్ వంటి సమస్యలు ఉంటే, యాప్ కాష్‌ని క్లియర్ చేయడం ద్వారా కొన్నిసార్లు సమస్యను పరిష్కరించవచ్చు.
స్టోరేజ్ స్పేస్‌ను కోసం.. మీకు స్టోరేజ్ స్పేస్ తక్కువగా ఉంటే, మీ కాష్‌ని క్లియర్ చేయడం వల్ల కొంత స్పేస్ ఖాళీ అవుతుంది.
కాష్‌ని ఎలా క్లియర్ చేయాలి?
ఆండ్రాయిడ్ ఫోన్‌లో కాష్‌ని క్లియర్ చేసే విధానం ఒక్కో ఫోన్ కి ఒక్కో విధంగా ఉంటుంది. మీ ఫోన్ తయారీదారు, సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ని బట్టి మారవచ్చు. అయితే సాధారణంగా ఈ ప్రక్రియ ఇలా ఉంటుంది..
మీ ఫోన్‌లో సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి. కిందికి స్క్రోల్ చేసి, యాప్స్‌పై నొక్కండి. మీరు కాష్‌ని క్లియర్ చేయాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి. స్టోరేజ్ పై నొక్కండి. క్లియర్ కాష్‌పై నొక్కండి.
అన్ని యాప్‌లలోని కాష్‌ను కూడా ఒకేసారి క్లియర్ చేయవచ్చు. అదెలా అంటే..
మీ ఫోన్‌లో సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి. క్రిందికి స్క్రోల్ చేయండి. స్టోరేజ్ పై నొక్కండి. కాష్ చేసిన డేటాపై నొక్కండి. ఓకే బటన్ పై నొక్కండి. యాప్ డేటాను క్లియర్ చేయడం కాష్‌ని క్లియర్ చేయడంతో పాటు, మీరు యాప్ డేటాను కూడా క్లియర్ చేయవచ్చు. ఇది లాగిన్ సమాచారం, సెట్టింగ్‌లు, వ్యక్తిగత ఫైల్‌లతో సహా మీ ఫోన్‌లో యాప్ నిల్వ చేసిన మొత్తం డేటాను తొలగిస్తుంది.
యాప్ డేటాను ఎలా క్లియర్ చేయాలి ?
ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్ డేటాను క్లియర్ చేసే విధానం మీ ఫోన్ తయారీదారు, సాఫ్ట్‌వేర్ వెర్షన్ ఆధారంగా మారవచ్చు. అయితే, సాధారణ ప్రక్రియ మాత్రం ఇలా ఉంటుంది. మీ ఫోన్‌లో సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి. క్రిందికి స్క్రోల్ చేసి, యాప్స్‌పై నొక్కండి. మీరు డేటాను క్లియర్ చేయాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి. దానిలోని స్టోరేజ్ పై క్లిక్ చేసి క్లియర్ డేటాను ఎంపిక చేసుకోండి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..