స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఐకూ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐకూ 12 సిరీస్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఐకూ 12 సిరీస్‌లో భాగంగా.. ఐకూ 12, ఐకూ 12 ప్రో స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేశారు. ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 45,000కాగా, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 50,000, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 53,000గా నిర్ణయించారు.