- Telugu News Photo Gallery Technology photos Vivo launches new smart watch Vivo Watch 3 features and price details
Vivo Watch 3: వివో నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ తెలిస్తే..
ప్రస్తుతం టెక్ మార్కెట్లో స్మార్ట్ వాచ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. ఒకప్పుడు భారీగా పలికిన స్మార్ట్ వాచ్ ధరలు కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థలన్నీ స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా....
Updated on: Nov 16, 2023 | 10:02 PM

చైనాకు చెందిన వివో.. స్మార్ట్ వాచ్ మార్కెట్లో దూకుడు పెంచింది. ఇటీవల తీసుకొచ్చిన వాచ్2కి కొనసాగింపుగా కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది. వివో వాచ్3 పేరుతో ఈ వాచ్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్.. త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.

ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.43 ఇంచెస్‌తో కూడిన రౌండ్ స్క్రీన్‌ను అందించారు. బ్లూ ఓఎస్‌తో పనిచేయనున్న ఈ వాచ్‌లో 16 రోజులు లైఫ్ ఇచ్చే బ్యాటరీని అందించారు. పలు రకాల హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించారు.

చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. థిన్నర్ స్టైలిష్ డిజైన్‌తో రూపొందించారు. స్టెయిన్‌లెస్ స్టీల్ రొటేటింట్ క్రౌన్‌ను ఇచ్చారు.

ఇక వాచ్‌కి కుడివైపు బటన్‌తో పాటు కర్వ్‌డ్ గ్లాస్‌తో 3డీ ఎఫెక్ట్‌ను మరిపించేలా స్క్రీన్‌ను అందించారు. హెల్త్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. హార్ట్ రేట్ మానిటర్, ఎస్‌పీఓ2 సెన్సర్, అసాధారణ ఫ్లక్చువేషన్స్‌లో యూజర్లను అలర్ట్ చేసే ఫీచర్లను అందించారు.

ఈ స్మార్ట్ వాచ్‌లో స్లీప్, స్ట్రెస్ లెవల్స్ ట్రాక్స్ వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ వాచ్‌లో 505 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. భారత కరెన్సీ ప్రకారం ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 15 వేలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.





























