Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Update: యూజర్లకు వాట్సాప్‌ షాక్‌… చాట్‌ బ్యాకప్‌ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే..!

అందరికీ అవసరమయ్యే చాట్‌ బ్యాకప్‌ విషయంలో చార్జీలను వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో చాట్ బ్యాకప్‌కి సంబంధించిన సర్వీస్ నిబంధనలను వాట్సాప్‌ అధికారికంగా అప్‌డేట్ చేసింది. తాజా అప్‌డేట్ ప్రకారం గూగుల్‌ డిస్క్‌లో వాట్సాప్‌ చాట్ బ్యాకప్‌లు ఇకపై ఉచితం కాదు. పైగా మీ గూగుల్‌ ఖాతా స్టోరేజ్‌ కిందే లెక్కిస్తారు.

Whatsapp Update: యూజర్లకు వాట్సాప్‌ షాక్‌… చాట్‌ బ్యాకప్‌ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే..!
Whatsapp
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 16, 2023 | 9:20 PM

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో స్మార్ట్‌ఫోన్స్‌లో వివిధ యాప్స్‌లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుల్లో ఇటీవల కాలంలో మెటా యాజమాన్యంలో ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ అయిన వాట్సాప్‌కు అయితే విపరీతమైన అభిమానులు ఏర్పడ్డారు. అయితే ఇప్పటి వరకూ పలు సర్వీసులు ఉచితంగా వాట్సాప్‌  పెరిగిన వినియోగదారుల నేపథ్యంలో సరికొత్త చార్జీలను వసూలు చేస్తున్నట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చింది. ముఖ్యంగా అందరికీ అవసరమయ్యే చాట్‌ బ్యాకప్‌ విషయంలో చార్జీలను వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో చాట్ బ్యాకప్‌కి సంబంధించిన సర్వీస్ నిబంధనలను వాట్సాప్‌ అధికారికంగా అప్‌డేట్ చేసింది. తాజా అప్‌డేట్ ప్రకారం గూగుల్‌ డిస్క్‌లో వాట్సాప్‌ చాట్ బ్యాకప్‌లు ఇకపై ఉచితం కాదు. పైగా మీ గూగుల్‌ ఖాతా స్టోరేజ్‌ కిందే లెక్కిస్తారు. కాబట్టి వాట్సాప్‌లో వచ్చిన ఈ తాజా అప్‌డేట్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఈ తాజా అప్‌డేట్‌ ఇప్పటికే వాట్సాప్‌ బీటా వినియోగదారులకు వర్తిస్తుంది. రాబోయే కొద్ది నెలల్లో సాధారణ వినియోగదారులకు కూడా ఇది అమలు చేయనున్నారు. అయితే ఈ అప్‌డేట్‌ కొత్తదేమి కాదని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఐక్లౌడ్‌లో అందుబాటులో ఉన్న నిల్వ కోటాకు ఐఓఎస్‌ పరికరాల్లో వాట్సాప్‌ ధీర్ఘ-పరిమిత చాట్‌ బ్యాకప్‌లను కలిగింది. అయితే ఇది కేవలం 5 జీబీ వరకూ మత్రమే ఉచితం. అలాగే గూగుల్‌ ప్రస్తుతం ప్రతి ఖాతాతో 15 జీబీ ఉచిత క్లౌడ్ నిల్వను అందిస్తుంది. అయితే ఈ స్టోరేజ్ జీమెయిల్‌, గూగుల్‌ఫోటోలు, ఇతర సేవలలో భాగస్వామ్యంతో వస్తుంది. ఆండ్రాయిడ్‌ పరికరంలో వాట్సాప్‌ను ఉపయోగించే వినియోగదారులు మీడియా ఫైల్‌లతో పాటు తమ చాట్‌లను పూర్తిగా బ్యాకప్ చేయడానికి ఇకపై గూగుల్‌ వన్‌ సభ్యత్వాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

గూగుల్‌ తన గూగుల్‌ వన్‌ క్లౌడ్ సేవను ఇటీవల కాలంలో చురుగ్గ ప్రమోట్ చేస్తోంది. ముఖ్యంగా గూగుల్‌ ఫోటోలలో ఉచిత అపరిమిత నిల్వను అందించడాన్ని కంపెనీ నిలిపివేసింది. చాలా మంది వినియోగదారులు తమ ఫోటోలు, వీడియోలను బ్యాకప్ చేయడం కొనసాగించడానికి గూగుల్‌ వన్‌ సభ్యత్వాన్ని పొందమని ప్రాంప్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

గూగుల్‌ డిస్క్‌లో చాట్‌ బ్యాకప్‌ ఇలా

మీకు గూగుల్‌ డిస్క్‌లో 15 జీబీ కోటాలో తగినంత ఉచిత నిల్వ ఉంటే మీరు మీ వాట్సాప్‌ చాట్‌లను ఉచితంగా బ్యాకప్ చేయవచ్చు. అదనంగా, అప్‌లోడ్ చేయడానికి ముందు ఫైల్ పరిమాణాన్ని తగ్గించడానికి మీరు వాట్సాప్‌ నుంచి నుండి అనవసరమైన కంటెంట్‌ను తొలగించవచ్చు. అంతేకాకుండా వాట్సాప్‌ వినియోగదారులు మీడియా లేకుండా టెక్స్ట్ సందేశాలను మాత్రమే బ్యాకప్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది చాట్ బ్యాకప్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వాట్సాప్ క్లౌడ్ బ్యాకప్‌పై ఆధారపడకుండా ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కి చాట్‌లను బదిలీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది తరచుగా స్మార్ట్‌ఫోన్ స్విచ్చర్‌లకు ఉపయోగపడుతుంది. తప్పనిసరై మీరు గూగుల్‌ క్లౌడ్‌ సేవలను పొందాలంటే ఈ సభ్యత్వం ధర నెలకు రూ. 130 లేదా సంవత్సరానికి రూ. 1300గా ఉంటుంది. అదనపు గూగుల్‌ ఫోటోల ఫీచర్‌లతో పాటు మరిన్నింటితో పాటు 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో