Xiaomi car: షావోమీ నుంచి ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. అదిరిపోయే స్మార్ట్ ఫీచర్స్..
ఇక ఆ తర్వాత షావోమి టెక్ మార్కెట్లో ఎన్నో రకాల గ్యాడ్జెట్స్‌ను తీసుకొచ్చాయి. రోబో వ్యాక్యూమ్ క్లీనర్ మొదలు స్మార్ట్ వాచ్‌లు, ఇయర్ బడ్స్‌తో పాటు ఇలా ఎన్నో అధునాతన ఫీచర్లతో కూడిన ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా కార్లను తీసుకొచ్చే పనిలో పడింది షావోమీ. షావోమీ కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్నారు. షావోమి ఎస్‌యూ7 పేరుతో ఈ కారును లాంచ్ చేయనున్నారు...
షావోమీ.. ఈ బ్రాండ్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్ మార్కెట్లో చెరగని ముద్ర వేసింది. మొదట్లో బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొచ్చిన షావోమీ, ఆ తర్వాత ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొచ్చాయి.
ఇక ఆ తర్వాత షావోమి టెక్ మార్కెట్లో ఎన్నో రకాల గ్యాడ్జెట్స్‌ను తీసుకొచ్చాయి. రోబో వ్యాక్యూమ్ క్లీనర్ మొదలు స్మార్ట్ వాచ్‌లు, ఇయర్ బడ్స్‌తో పాటు ఇలా ఎన్నో అధునాతన ఫీచర్లతో కూడిన ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా కార్లను తీసుకొచ్చే పనిలో పడింది షావోమీ. షావోమీ కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్నారు. షావోమి ఎస్‌యూ7 పేరుతో ఈ కారును లాంచ్ చేయనున్నారు.
ఇప్పటికే షావోమీ ఈ కార్లకు సంబంధించి లైసెన్స్ కోసం చైనాలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే షావోమీ ఈ కార్లను స్వయంగా రూపొందించడం లేదు..‘బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ (BAIC)’ సహకారంతో ఈ కార్లను తయారు చేస్తోంది. ఇందు కోసం సదరు కంపెనీకి కాంట్రాక్టుకు ఇచ్చింది. ఇక చైనా ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా షావోమీ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి కొన్ని వివరాలను విడుదల చేసింది.
సెడాన్ విభాగంలో ఈ కారును తీసుకొస్తోంది. ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో వీల్‌బేస్ 3000 ఎంఎంగా ఇవ్వనున్నారు. లైడర్ సెన్సర్ వంటి అధునాతన ఫీచర్‌ను అందించనున్నారు. ఇక ఈ కారులో ‘ఫేస్ రికగ్నిషన్ అన్‌లాకింగ్’ ఫీచర్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అంటే స్మార్ట్ ఫోన్‌ను ఎలా అయితే మొహం చూపించి అన్‌లాక్ చేసుకుంటున్నామో, కారు కూడా కీ లేకుండా అన్‌లాక్ చేసకోవచ్చు. ఇక ఈ కారులో రెండు రకాల బ్యాటరీలను అందించారు. వీటిలో ఒకి 220 కిలోవాట్ మోటార్‌తో కూడిన ‘రియర్ వీల్ డ్రైవ్ (RWD)’.. కాగా మరొకటి 495 కిలోవాట్ మ్యాగ్జిమమ్ పవర్‌తో కూడిన ‘ఆల్ వీల్ డ్రైవ్’ను ఇవ్వనున్నారు.
ఈ కారును మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకున్నారు. షావోమి ఎస్‌యూ7, ఎస్‌యూ7 ప్రో, ఎస్‌యూ7 మ్యాక్స్ వేరియంట్స్‌లో ఈ కారు అందుబాటులోకి రానుంది. హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఓఎస్‌ను తీసుకురానున్నారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కార్లతో పాటు ఫోన్‌లలోనూ ఉపయోగించుకోవచ్చు. 2023 డిసెంబర్‌లో ఈ కారును లాంచ్ చేసి, 2024 ఫిబ్రవరి నుంచి సేల్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆటోమొబైల్ సంస్థలో షావోమీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..