Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Notifications: మీకు కావాల్సిన వాళ్లు వాట్సాప్‌ ఆన్‌లైన్‌లోకి రాగానే మీకు నోటిఫికేషన్‌.. ఈ సింపుల్‌ టిప్‌తో సాధ్యం

మనకు కావాల్సిన వాళ్లు ఆన్‌లైన్‌లో లేకపోతే వాళ్లు ఆన్‌లైన్‌లోకి వచ్చారో? లేదో? తరచూ తనిఖీ చేస్తూ ఉంటాం. అయితే ఓ సింపుల్‌ టిప్‌ పాటించి వారు వాట్సాప్‌ ఆన్‌లైన్‌లోకి రాగానే నోటిఫికేషన్‌ వస్తుంది. అవును మీరు వింటున్నది నిజమే. ఆ టిప్‌ ఏంటో? ఓ సారి తెలుసుకుందాం. 

Whatsapp Notifications: మీకు కావాల్సిన వాళ్లు వాట్సాప్‌ ఆన్‌లైన్‌లోకి రాగానే మీకు నోటిఫికేషన్‌.. ఈ సింపుల్‌ టిప్‌తో సాధ్యం
Whatsapp
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 07, 2023 | 9:35 PM

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉపయోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌. వాట్సాప్‌ కమ్యూనికేట్ చేసే విధానాన్ని మార్చేసింది. ఇది నిజ సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో కనెక్ట్ అవ్వడానికి, సందేశాలు, ఫోటోలు, వీడియోలను భాగస్వామ్యం చేయడానికి, వాయిస్, వీడియో కాల్‌లను కూడా చేయడానికి అనుమతి ఇస్తుంది. అయితే మనకు కావాల్సిన వాళ్లు ఆన్‌లైన్‌లో లేకపోతే వాళ్లు ఆన్‌లైన్‌లోకి వచ్చారో? లేదో? తరచూ తనిఖీ చేస్తూ ఉంటాం. అయితే ఓ సింపుల్‌ టిప్‌ పాటించి వారు వాట్సాప్‌ ఆన్‌లైన్‌లోకి రాగానే నోటిఫికేషన్‌ వస్తుంది. అవును మీరు వింటున్నది నిజమే. ఆ టిప్‌ ఏంటో? ఓ సారి తెలుసుకుందాం. 

వాట్సాప్‌ అధికారికంగా నోటిఫికేషన్‌ తనిఖీ ఫీచర్‌ను అందించదు. అయితే మీరు ఆండ్రాయిడ్‌ వినియోగదారు అయితే ఎవరైనా వాట్సాప్‌ ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు నోటిఫికేషన్‌ను పొందడానికి మీరు డబ్ల్యూఏఎల్‌ఓజీ-వాట్సాప్‌ ట్రాకర్‌ని ఉపయోగించవచ్చు. మీ ఫోన్‌లో డబ్ల్యూఏఎల్‌ఓజీ-వాట్సాప్‌ ట్రాకర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. అనంతరం యాప్‌ను తెరిచి మీరు ఎవరి వాట్సాప్ ఆన్‌లైన్ నోటిఫికేషన్‌ను స్వీకరించాలనుకుంటున్నారో వారి నంబర్‌ను నమోదు చేయాలి. వాట్సాప్‌లో ఆన్‌లైన్‌కి వచ్చినప్పుడు నోటిఫికేషన్‌లను పొందడానికి సమర్పించు బటన్‌పై నొక్కండి. అంతే ఇప్పుడు వారు వాట్సాప్‌లో ఆన్‌లైన్‌కి వచ్చిన ప్రతిసారీ మీకు నోటిఫికేషన్ వస్తుంది.

డబ్ల్యూఏ ట్రాకర్‌

ఎవరైనా వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ పొందడానికి డబ్ల్యూఏ ట్రాకర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి కూడా పొందవచ్చు. ముందుగా యాప్‌ను తెరిచి మీరు ఆన్‌లైన్ నోటిఫికేషన్‌ను స్వీకరించాలనుకుంటున్న వాట్సాప్‌ నంబర్‌ను నమోదు చేయాలి. ఇప్పుడు వారు ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్‌ వస్తుంది. ఈ యాప్‌ నోటిఫికేషన్‌ను పొందే ఉత్తమ యాప్‌లలో ఒకటిగా ఉంది. లక్ష్య వినియోగదారు ఆన్‌లైన్ స్థితిని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా, వారు ఆన్‌లైన్‌కి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్‌లను పంపడం ద్వారా ఈ యాప్ పని చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

అయితే ఇలాంటి యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే అవి వాట్సాప్‌ సేవా నిబంధనలు, గోప్యతా విధానాలను ఉల్లంఘించి మీకు వాట్సాప్‌ నోటిఫికేషన్‌ అందిస్తాయి. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలుగు రాష్ట్రాల్లో అపార నష్టం.. మరో ఐదు రోజులు వానలే వానలు..!
తెలుగు రాష్ట్రాల్లో అపార నష్టం.. మరో ఐదు రోజులు వానలే వానలు..!
బాబా వంగా అంచనా నిజమవుతుందా? అక్కడ ముస్లిం పాలనలోకి 44 దేశాలు
బాబా వంగా అంచనా నిజమవుతుందా? అక్కడ ముస్లిం పాలనలోకి 44 దేశాలు
ఈ కారుతో సౌకర్యవంతమైన ప్రయాణం.. వోక్స్‌వ్యాగన్ నయా ఎడిషన్ లాంచ్.!
ఈ కారుతో సౌకర్యవంతమైన ప్రయాణం.. వోక్స్‌వ్యాగన్ నయా ఎడిషన్ లాంచ్.!
Virat Kohli: 17 ఏళ్ల తర్వాత సేమ్ సీన్‌తో చెత్త రికార్డ్..
Virat Kohli: 17 ఏళ్ల తర్వాత సేమ్ సీన్‌తో చెత్త రికార్డ్..
ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే
ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే
శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం ఎలా పూజించాలంటే..
శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం ఎలా పూజించాలంటే..
ఆర్‌సీబీకి చుక్కెదురు.. హ్యాట్రిక్ ఓటమితో ప్లేఆఫ్స్ నుంచి దూరం?
ఆర్‌సీబీకి చుక్కెదురు.. హ్యాట్రిక్ ఓటమితో ప్లేఆఫ్స్ నుంచి దూరం?
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు అంచనాలకు మించి లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు అంచనాలకు మించి లాభాలు..
కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకు ఈ నీళ్లు మంచి మందులా పనిచేస్తాయి
కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకు ఈ నీళ్లు మంచి మందులా పనిచేస్తాయి
బరువు తగ్గాలనుకుంటే వీటిని మీ డైట్‌లో తప్పకుండా చేర్చండి..!
బరువు తగ్గాలనుకుంటే వీటిని మీ డైట్‌లో తప్పకుండా చేర్చండి..!