Car Air Purifier: కారు ఎయిర్‌ప్యూరిఫైయర్‌లు నిజంగానే పని చేస్తాయా? అసలు విషయంలో తెలిస్తే షాకవుతారు..!
ప్రస్తుత రోజుల్లో అందరికీ కారు ఉండడం అనేది సహజంగానే మారింది. ఈ నేపథ్యంలో కారుల్లో కూడా కంపెనీలు ఎయిర్ ప్యూరిఫైయర్‌లను అందిస్తున్నాయి. అలాగే కొన్ని మోడల్ కంపెనీల కారులకు మాత్రం ఎయిర్‌ప్యూరిఫైయర్‌లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే కారుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్‌లను కొనుగోలు చేద్దామనుకునే వారికి నిజంగానే ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌లు పని చేస్తాయా? అని అనుమానం కలుగుతూ ఉంటుంది.

భారతదేశంలో నానాటికి కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. గ్రామాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో ఈ కాలుష్య స్థాయిలు తారాస్థాయికు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్‌ల కొనుగోలు అనేది తప్పనిసరి అవసరంగా మారింది. అలాగే ప్రస్తుత రోజుల్లో అందరికీ కారు ఉండడం అనేది సహజంగానే మారింది. ఈ నేపథ్యంలో కారుల్లో కూడా కంపెనీలు ఎయిర్ ప్యూరిఫైయర్‌లను అందిస్తున్నాయి. అలాగే కొన్ని మోడల్ కంపెనీల కారులకు మాత్రం ఎయిర్‌ప్యూరిఫైయర్‌లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే కారుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్‌లను కొనుగోలు చేద్దామనుకునే వారికి నిజంగానే ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌లు పని చేస్తాయా? అని అనుమానం కలుగుతూ ఉంటుంది. కాబట్టి కారుల్లో ఎయిర్‌ప్యూరిఫైయర్ పనితనం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో? ఓ సారి తెలుసుకుందాం.
కారుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్‌ల చోటు కారు కంపెనీ బట్టి మారుతూ ఉంటుంది. హ్యూందాయ్, క్రెటా వంటి కంపెనీలు తమ కారుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను సెంటర్ ఆర్మ్ రెస్ట్ కింద పెడుతున్నారు. ఇలా చేయడం ద్వారా వినియోగదారులు ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవడం సులభతరం అవుతుంది. టాటా, మహీంద్రా వంటి కార్ల కంపెనీల మాత్రం వీటిని కారుల్లో ఉన్న ఏసీలతో అనుసంధానించారు. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ద్వారా నియంత్రించవచ్చు. అయితే ఎయిర్ ప్యూరిఫైయర్‌లు ఎలా ఉన్నా వీటిని తరచూ శుభ్రం చేయడం లేదా మార్చడం అనేది పెద్ద ప్రహసనంలా ఉంటుంది. ముఖ్యంగా వీటికి డబ్బు తగలేస్తున్నామనే భావన కారు వినియోగదారులకు కలుగుతూ ఉంటుంది.
ఎయిర్ ప్యూరిఫైయర్‌ల పనితీరు ఇలా
మన ఇంట్లోని ఎయిర్ ప్యూరిఫైయర్‌ల మాదిరిగానే కారుల్లోని ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఫ్యాన్ ఆధారంగా పని చేస్తాయి. ఈ ఫ్యాన్ ద్వారా ముందు మురికి గాలిని సంగ్రహించి ఫిల్టర్ సెట్ ద్వారా శుభ్రం చేసి మంచిగాలిని ప్రసరిస్తుంది. కారుల్లో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌లు అస్థిర కర్బన్ సమ్మేళనాలు, ప్రమాదకర వాయువులు, బలమైన వాసనలను పొగొట్టడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎయిర్‌ప్యూరిఫైయర్‌లో ఉండే హెచ్‌ఈపీఏ ఫిల్టర్ సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్, పుప్పొడి వంటి గాలిలోని ఎలర్జీ కారకాలను ఫిల్టర్ చేస్తుంది. కొన్ని ఎయిర్‌ఫిల్టర్ యూవీ ఆధారంగా పని చేస్తాయి. ఇవి కూడా ప్రమాదకర బ్యాక్టిరియాను సంహరించి మనకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా అన్ని రకాల ఎయిర్ ప్యూరిఫైయర్‌లు దాదాపు 99 శాతం మేర గాలిని శుభ్రం చేస్తాయి.
కారు కోసం ఎయిర్ ప్యూరిఫైయర్‌ను కొనుగోలు చేయవచ్చా?
మీరు ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో నివసిస్తుంటే కచ్చితంగా కారులో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్‌ను కొనుగోలు చేయాలి. ఇంట్లో ఉండే ఎయిర్ ప్యూరిఫైయర్‌ల మాదిరిగానే కారులో ఉండే ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా పని చేస్తుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ట్రాఫిక్ గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కారులోనే ఎక్కు సమయం గడుపుతాం. కాబట్టి కచ్చితంగా కారులో ఎయిర్ ప్యూరిఫైయర్‌ను పెట్టుకోవడం ఉత్తమం. కారుల్లోనే వచ్చే అంతర్నిర్మిత ఎయిర్ ప్యూరిఫైయర్‌లు ప్రాక్టికాలిటీకు అంతరాయ కలిగించవు. అలాగే వాటి నిర్వహణ కూడా అలావాటు చేసుకుంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే కొన్ని కార్లల్లో ఎయిర్ ప్యూరిఫైయర్‌లు ఉండవు కాబట్టి వాటిని పెట్టుకోవడం ఉత్తమం. ముఖ్యంగా హానికర బ్యాక్టిరియా నుంచి రక్షణకు వీటిని కచ్చితంగా కొనుగోలు చేయాలి. ఫిలిప్స్, బ్లౌపంక్ట్ వంటి కంపెనీలు ప్రత్యేకంగా కార్ల కోసం ఎయిర్ ప్యూరిఫైయర్‌లను హెచ్‌ఈపీఏ టెక్నాలజీతో అందిస్తున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుగోలు అనేది మన ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం. కాబట్టి ధర ఎక్కువైన మంచి రేటింగ్‌తో ఉండే ఎయిర్ ప్యూరిఫైయర్‌ను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..