Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deep fake: అసలేంటీ డీప్‌ ఫేక్‌ వీడియో టెక్నాలజీ.. దీని బారిన మీరు పడకూడదంటే ఏం చేయాలి.?

ఇటీవల రష్మిక మందనను పోలినట్లు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. బ్లాక్‌ జిమ్‌ డ్రస్‌లో ఉన్న ఓ అమ్మాయి అచ్చంగా రష్మికను పోలి ఉండడంతో ఈ వీడియోలో ఉంది రష్మికనే అని చాలా మంది భావించారు. అయితే ఇదొక ఫేక్‌ వీడియో అని తర్వాత తెలిసింది. డీప్‌ ఫేక్‌ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఆధారంగా ఈ వీడియోను రూపొందించినట్లు వెల్లడైంది. దీంతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మొదలు....

Deep fake: అసలేంటీ డీప్‌ ఫేక్‌ వీడియో టెక్నాలజీ.. దీని బారిన మీరు పడకూడదంటే ఏం చేయాలి.?
Deep Fake
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 07, 2023 | 4:35 PM

ప్రస్తుతం సోషల్‌ మీడియా అంతా డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ గురించే చర్చ జరుగుతోంది. సినీ నటి రష్మికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుండడంతో ఇప్పుడీ అంశం చర్చగా మారింది. ప్రభుత్వాలు, సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ అంటే ఏంటి.? దీనివల్ల జరిగే నష్టం ఏంటి.? ఈ బారిన మనం పడకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల రష్మిక మందనను పోలినట్లు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. బ్లాక్‌ జిమ్‌ డ్రస్‌లో ఉన్న ఓ అమ్మాయి అచ్చంగా రష్మికను పోలి ఉండడంతో ఈ వీడియోలో ఉంది రష్మికనే అని చాలా మంది భావించారు. అయితే ఇదొక ఫేక్‌ వీడియో అని తర్వాత తెలిసింది. డీప్‌ ఫేక్‌ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఆధారంగా ఈ వీడియోను రూపొందించినట్లు వెల్లడైంది. దీంతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మొదలు, అమితాబ్‌, నాగచైతన్య వంటి పలువురు సెలబ్రిటీలు సైతం స్పందించారు.

అసలేంటీ డీప్‌ ఫేక్‌..?

డీప్‌ ఫేన్‌ టెక్నాలజీతో ఒక వ్యక్తి మొహాన్ని మరో వ్యక్తిగా మార్చేయవచ్చు. ఫొటో లేదా వీడియోలో ఉన్న మరో వ్యక్తి మొహం స్థానంలో మరొక వ్యక్తి ముహాన్ని సెట్‌ చేయవచ్చు. ఇది ఒకరమైన సింథటిక్‌ వీడియో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో ఇలా వీడియోలను రూపొందిస్తున్నారు. దీంతో నకిలీ వీడియోలను రూంపొందిస్తూ కొందరు రాక్షసానందం పొందుతున్నారు. జారా పటేల్‌ అనే మహిళ ఫేస్‌ ప్లేస్‌లో రష్మిక ఫేస్‌ను రీప్లెస్ చేసి సదరు ఫేక్‌ వీడియోను వైరల్‌ చేశారు. ఈ వీడియోను క్షూణ్నంగా గమనిస్తే లిఫ్ట్‌లోకి ఎంటర్‌ అవుతున్న సమయంలో ఒరిజినల్‌ ఫేస్‌ కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వెంటనే ఫేస్‌ మారినట్లు గుర్తించవచ్చు. దీనిని బట్టే ఇదొక ఫేక్‌ వీడియో అని స్పష్టవుతోంది.

ఎలా బయటపడాలి.?

ఇర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అయితే దీని బారిన మనం పడకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ పోస్ట్ చేస్తే మీ ఫొటోలతో ఇలాంటి ఫేక్‌ వీడియోలను రూపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫొటోలోను సోషల్‌ మీడియా సైట్స్‌ పోస్ట్ చేయకుండా ఉండడమే ఉత్తమం, ఒకవేళ చేసినా మీ ప్రొఫైల్‌ను ప్రైవేట్‌గా పెట్టుకోవాలని చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..