Whatsapp Update: వాట్సాప్‌ ఖాతా కావాలంటే అది తప్పనిసరి… భద్రతా ఫీచర్లను అప్‌డేట్‌ చేసిన వాట్సాప్‌..!

తాజాగా వాట్సాప్‌  దాని ప్లాట్‌ఫారమ్‌కు చాలా ఫీచర్‌లను జోడిస్తోంది. ముఖ్యంగా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే విధంగా సరికొత్త భద్రతా ఫీచర్‌ను అందిస్తోంది. సాధారణంగా వాట్సాప్‌ ఖాతాను ధ్రువీకరించడానికి కచ్చితంగా ఫోన్‌ నెంబర్‌ అవసరం. అయితే ఇప్పుడు వినియోగదారులు వారి ఖాతాను ధ్రువీకరించడానికి కొత్త మార్గాన్ని పరీక్షిస్తున్నట్లు తేలింది.

Whatsapp Update: వాట్సాప్‌ ఖాతా కావాలంటే అది తప్పనిసరి… భద్రతా ఫీచర్లను అప్‌డేట్‌ చేసిన వాట్సాప్‌..!
Whatsapp
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 09, 2023 | 8:55 PM

స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విపరీతంగా పెరిగాక అందులోని వివిధ యాప్స్‌ ఎక్కువగా ప్రజాదరణను పొందాయి. వాట్సాప్‌ అందులో ముందు వరుసలో ఉంటుంది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వాట్సాప్‌ కూడా ఎ‍ప్పటికప్పుడు కొత్తకొత​ అప్‌డేట్స్‌ అందిస్తుంది. తాజాగా వాట్సాప్‌  దాని ప్లాట్‌ఫారమ్‌కు చాలా ఫీచర్‌లను జోడిస్తోంది. ముఖ్యంగా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే విధంగా సరికొత్త భద్రతా ఫీచర్‌ను అందిస్తోంది. సాధారణంగా వాట్సాప్‌ ఖాతాను ధ్రువీకరించడానికి కచ్చితంగా ఫోన్‌ నెంబర్‌ అవసరం. అయితే ఇప్పుడు వినియోగదారులు వారి ఖాతాను ధ్రువీకరించడానికి కొత్త మార్గాన్ని పరీక్షిస్తున్నట్లు తేలింది. వాట్సాప్‌ ఖాతాను ధ్రువీకరించే ఆ నయా అప్‌డేట్‌ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

వాట్సాప్‌ త్వరలో ఇమెయిల్ ద్వారా మీ ఖాతాను ధ్రువీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వాట్సాప్‌కు సంబంధించిన బీటా వెర్షన్‌లో గుర్తించిన ఈ ఫీచర్‌ వాట్సాప్‌కు సైన్ ఇన్ చేయడానికి అదనపు ఎంపికను ఇస్తుంది. ప్రస్తుతానికి వాట్సాప్‌ ఖాతాదారులు వారి ఫోన్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించి వారి ఖాతాను ధ్రువీకరించడానికి అనుమతిస్తుంది. వాట్సాప్‌  బీటా ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేసిన వ్యక్తులు తాజా అప్‌డేట్ ద్వారా ఫీచర్‌ను పొందుతున్నారు. వాట్సాప్ బీటా వెర్షన్‌ను ఉపయోగిస్తున్న వారు యాప్ సెట్టింగ్‌ల్లోకి వెళ్లి అనంతరం ఖాతాను సెలెక్ట్‌ చేసుకుని ఈ-మెయిల్ చిరునామాకు వెళ్లి కొత్త ఫీచర్ కోసం తనిఖీ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.23.24.10 వెర్షన్, 2.23.24.8, 2.23.24.9 కోసం అందుబాటులో ఉంది.

రెండు నెంబర్లకు ఒకే ఖాతా 

వాట్సాప్ ఇటీవల ఒక ఖాతాలో రెండు మొబైల్ నంబర్‌లను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని జోడించింది. ఒక పరికరంలో రెండు వేర్వేరు ఖాతాలను ఉపయోగించగలిగేలా వ్యక్తులు గతంలో ఫోన్‌లలో డ్యూయల్ లేదా క్లోన్ యాప్ ఫీచర్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను అప్‌డేట్‌ చేసింది. విభిన్న నంబర్‌లను ఉపయోగించే వినియోగదారులతో సులభంగా కనెక్ట్ అయ్యేలా అనేక మంది వ్యక్తుల ఉద్యోగాలను సులభతరం చేయడానికి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే యాప్‌లో రెండవ వాట్సాప్ ఖాతాను సెటప్ చేయడం అనేది సరళమైన ప్రక్రియ. మీకు రెండవ ఫోన్ నంబర్, సిమ్‌ కార్డ్ లేదా బహుళ సిమ్‌ లేదా ఈ-సిమ్‌ సాంకేతికతకు మద్దతు ఇచ్చే పరికరం అవసరం. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన అధికారిక బ్లాగ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం మీ ప్రతి ఖాతాకు సంబంధించిన గోప్యత, నోటిఫికేషన్ సెట్టింగ్‌లపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది. మరికొన్ని వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఫీచర్‌ ప్రస్తుతం వాట్సాప్‌ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..