Iqoo 12: మార్కెట్‌లోకి ఐక్యూ నయా ఫోన్.. స్టన్నింగ్ ఫీచర్స్‌తో అదిరే స్పెసిఫికేషన్లు.. భారత్‌లో లాంచింగ్ ఎప్పుడంటే?
తాజాగా ప్రముఖ బ్రాండ్ ఐక్యూ సరికొత్త ఫోన్‌తో మన ముందుకు వచ్చింది. ఐక్యూ 12 సిరీస్ ఫోన్ చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. త్వరలోనే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను భారతదేశంలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ఐక్యూ 12, ఐక్యూ 12 ప్రో పేరుతో ఈ ఫోన్లకు ఐక్యూ కంపెనీ డిసెంబర్ 12న లాంచ్ చేసే అవకాశం ఉంది. భారతదేశంలో ఐక్యూ ఫోన్లు అమెజాన్‌లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. గతంలో ఫోన్ అంటే కేవలం ఫోన్స్, మెసేజ్‌లకు మాత్రమే ఉపయోగించే వారు. కానీ స్మార్ట్ ఫోన్ రాకతో ట్రెండ్ పూర్తిగా మారింది. ప్రతి చిన్న అవసరానికి స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరిగా మారింది. స్మార్ట్ ఫోన్లకు పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ బ్రాండ్ ఐక్యూ సరికొత్త ఫోన్‌తో మన ముందుకు వచ్చింది. ఐక్యూ 12 సిరీస్ ఫోన్ చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. త్వరలోనే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను భారతదేశంలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ఐక్యూ 12, ఐక్యూ 12 ప్రో పేరుతో ఈ ఫోన్లకు ఐక్యూ కంపెనీ డిసెంబర్ 12న లాంచ్ చేసే అవకాశం ఉంది. భారతదేశంలో ఐక్యూ ఫోన్లు అమెజాన్‌లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. అయితే ఐక్యూ 12 సిరీస్‌కు సంబంధించిన టీజర్ ఇప్పటికీ విడుదల చేయలేదు. ఈ టీజర్‌ను బట్టే స్మార్ట్‌ఫోన్ గురించి ఓ అంచనాకు వచ్చే వీలుంది. అయితే చైనాలో అందుబాటులో ఉన్న ఐక్యూ 12 సిరీస్ ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఐక్యూ 12 సిరీస్ ఫీచర్లు
ఐక్యూ 12 ఫోన్లు 12 జీబీ+256 జీబీ, 16 జీబీ+ 512 జీబీ, 16 జీబీ + 1 టీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటాయి. వీటి ధర భారత మార్కెట్‌లో వరుసగా రూ.45,000 నుంచి రూ.57,000 వరకూ ఉంటుంది. ఈ సిరీస్ 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల హెచ్‌డీఆర్ 10+ ఎమోఎల్‌ఈడీ స్క్రీన్‌తో పని చేస్తుంది. ఐక్యూ 12 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 1.5 కే రిజల్యూషన్, ఐక్యూ 12 ప్రో 2 కే రిజల్యూషన్‌తో వస్తుది. ఐక్యూ 12 సిరీస్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే 120 వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. అలాగే ఐక్యూ 12 ప్రో మోడల్ 120 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,100 mAh బ్యాటరీతో వస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 64 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50 ఎంపీ అల్ట్రావైడ్-యాంగిల్ లెన్స్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సిరీస్ ఫోన్లు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పని చేస్తుంది. ఐక్యూ 12 ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పని చేస్తుంది. అయితే ప్రో మోడల్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ 68 రేటింగ్ ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..