iQOO Z7 Pro 5G: క్లాసీ లుక్‌లో కొత్త 5జీ ఫోన్.. టాప్ క్లాస్ ఫీచర్స్.. హై రేంజ్ స్పెసిఫికేషన్లు..
ఇటీవల కాలంలో వినియోగదారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటున్న ఐక్యూఓఓ నుంచి మరో కొత్త 5జీ ఫోన్ మన దేశ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఐక్యూఓఓ జెడ్7 ప్రో పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 23,999గా ఉంది. ఈ కొత్త 5జీ ఫోన్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలు సాగిస్తున్న వన్ ప్లస్ నార్డ్ సీఈ3 వంటి ఫోన్లతో పోటీ పడనుంది. ఈ మిడ్ రేంజ్ 5జీ ఫోన్లో పెద్ద డిస్ ప్లే ఉంటుంది. భారీ బ్యాటరీ ఉంటుంది.
మార్కెట్లోకి పెద్ద సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. వాటిల్లో 5జీ ఫోన్లు అధికంగా ఉంటున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల కాలంలో వినియోగదారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటున్న ఐక్యూఓఓ నుంచి మరో కొత్త 5జీ ఫోన్ మన దేశ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఐక్యూఓఓ జెడ్7 ప్రో పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 23,999గా ఉంది. ఈ కొత్త 5జీ ఫోన్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలు సాగిస్తున్న వన్ ప్లస్ నార్డ్ సీఈ3 వంటి ఫోన్లతో పోటీ పడనుంది. ఈ మిడ్ రేంజ్ 5జీ ఫోన్లో పెద్ద డిస్ ప్లే ఉంటుంది. భారీ బ్యాటరీ ఉంటుంది. శక్తివంతమైన మీడియాటెక్ ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఐక్యూఓఓ జెడ్ 7 ప్రో డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. యూనిక్ బ్లూ లాగూన్ పెయింట్ జాబ్ తో వస్తుంది. ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ధర, లభ్యత..
ఐక్యూఓఓ జెడ్7 ప్రో 5జీ ఫోన్ ధరలు పరిశీలిస్తే 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 23,999గా ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్ కింద దీనిని రూ. 21,999కే విక్రయిస్తున్నారు. అదే విధంగా 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999కాబా, రూ. 22,999కే లభిస్తోంది. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకూ ఉంటాయి. ఐక్యూఓఓ ఈ-స్టోర్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో లభిస్తోంది.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
ఐక్యూఓఓ జెడ్ 7 ప్రో 5జీ ఫోన్లో 6.74 అంగుళాల స్క్రీన్ ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ తో ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్ సెట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది.
కెమెరా వషయానికి వస్తే వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది. 64ఎంపీ మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ తో ఉంటుంది. 2ఎంపీ సెన్సార్ కూడా ఉంటుంది. ముందు వైపు సెల్ఫీల కోసం 16ఎంపీ మెగా పిక్సల్ సెన్సార్ ఉంటుంది.
ఇక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే వైఫై 6, బ్లూటూత్ 5.3 ఉంటుంది. ఈ 5జీ ఫోన్ లో 4,600ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 66వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. డిస్ ప్లే లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫోన్ కింద సింగిల్ స్పీకర్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ తో పాటు క్లాస్ లుక్ లో ఫోన్ కావాలనుకొనే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్. కర్వడ్ స్కీన్ మీకు అల్టిమేట్ లుక్ ను అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..