Best Smartphone: కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈ నెలలో వస్తోన్న స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..

5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడిన ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి ఈ నెలలో కొంగొత్త ఫోన్‌లు దర్శనమివ్వనున్నాయి. వినాయకచవితి, దసరా పండగల నేపథ్యంలో కంపెనీలు వరుసగా కొత్త ఫోన్‌లను తీసుకొచ్చే పనిలో పడ్డాయి. మరి వచ్చే నెలలో టెక్‌ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న...

Best Smartphone: కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈ నెలలో వస్తోన్న స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..
Best Smart Phone
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 01, 2023 | 11:15 AM

మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడిన ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి ఈ నెలలో కొంగొత్త ఫోన్‌లు దర్శనమివ్వనున్నాయి. వినాయకచవితి, దసరా పండగల నేపథ్యంలో కంపెనీలు వరుసగా కొత్త ఫోన్‌లను తీసుకొచ్చే పనిలో పడ్డాయి. మరి వచ్చే నెలలో టెక్‌ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

ఆగస్టు నెల చివరి తేదీన చైనాకు చెందిన ఐక్యూ జెడ్‌7 ప్రో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ మొత్తం రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 23,999 కాగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 24,99గా ఉంది. ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే 64 ఎంపీ రెయిర్‌ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ నెలలో మార్కెట్లోకి వస్తోన్న మరో స్మార్ట్ ఫోన్‌ టెక్నో.. టెక్నో పోవా 5, పోవా 5 ప్రో పేరుతో రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేసింది. టెక్నో పోవా 5 ఫోన్‌లో 6.78 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్‌ హీలియో జీ99 6ఎన్‌ఎమ్‌ చిప్‌సెట్‌ను అందించారు. టెక్నో పోవా 5 స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 11,999గా ఉంది. ఇక టెక్నో పోవా 5 ప్రో 5జీ ఫోన్‌ విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 14,999గా ఉంది.

ఇక సెప్టెంబర్ నెలలో ఐఫోన్స్‌ కూడా మార్కెట్లో సందడి చేయనున్నాయి. ఐఫోన్‌ 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 15, 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ ప్రొ మ్యాక్స్‌ వంటి ఫోన్స్‌ లాంచ్‌ కానున్నాయి. ఇక రెండేళ్ల తర్వాత హానర్‌ భారత మార్కెట్లోకి ఇదే నెలలో కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేయనున్నారు. హానర్ 90 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ ఫోన్‌లో 6.4 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. ఇందులో 50 ఎంపీ రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. అలాగే ఈ నెలలో సామ్‌సంగ్‌ నుంచి గ్యాలక్సీ ఎస్‌ 23 ఎఫ్‌ఈ పేరుతో కొత్త ఫోన్‌ రానుంది. అంతేకాకుండా మోటోరాల నుంచి మోటో జీ54 పేరుతో 5జీ ఫోన్‌ లాంచ్‌ చేయనున్నారు. ఇందులో 6.5 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌+ డిస్‌ప్లేతో పాటు 50 ఎంపీ రెయిర్ కెమెరా ఇవ్వనున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..