Whatsapp Support: వాట్సాప్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. ఈ నెల నుంచి ఆ ఫోన్స్‌లో సేవలు బంద్‌

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్తకొత్త అప్‌డేట్స్‌ను ఇస్తూ యువతను ఆకర్షిస్తుంది. అయితే వాట్సాప్‌ ఆపరేటింగ్ సిస్టమ్ ఇటీవలి వెర్షన్‌లలో వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని, అలాగే తాజా ప్రయోజనాలను పొందడంపై దృష్టి పెట్టాలనుకుంటోంది. భద్రతా లక్షణాలు, సాంకేతిక పురోగతి విషయాల్లో కొత్త వాటిపై దృష్టి పెట్టడానికి ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ వెర్షన్ 4.1, అంతకంటే పాత వాటిపై నడుస్తున్న కొన్ని పాత స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు మద్దతును ముగించింది.

Whatsapp Support: వాట్సాప్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. ఈ నెల నుంచి ఆ ఫోన్స్‌లో సేవలు బంద్‌
Whatsapp2
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 17, 2023 | 7:30 PM

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్స్‌లో వచ్చే వివిధ యాప్స్‌ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నారు. ఈ వరుసలో వాట్సాప్‌ ముందు ఉంటుంది. వాట్సాప్‌ నుంచి కేవలం మెసేజ్‌లు మాత్రమే కాకుండా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్‌ చేసుకోవడంతో పాటు ఆడియో, వీడియో కాల్స్‌ సపోర్ట్‌ చేయడంతో యువత ఎక్కువగా వాడుతున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్తకొత్త అప్‌డేట్స్‌ను ఇస్తూ యువతను ఆకర్షిస్తుంది. అయితే వాట్సాప్‌ ఆపరేటింగ్ సిస్టమ్ ఇటీవలి వెర్షన్‌లలో వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని, అలాగే తాజా ప్రయోజనాలను పొందడంపై దృష్టి పెట్టాలనుకుంటోంది. భద్రతా లక్షణాలు, సాంకేతిక పురోగతి విషయాల్లో కొత్త వాటిపై దృష్టి పెట్టడానికి ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ వెర్షన్ 4.1, అంతకంటే పాత వాటిపై నడుస్తున్న కొన్ని పాత స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు మద్దతును ముగించింది. ముఖ్యంగా వినియోగదారలు భద్రత నేపథ్యంలో వాట్సాప్‌ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వాట్సాప్‌ తాజా నిర్ణయం ఈ నెల్లోనే అమల్లోకి రానుంది. కాబట్టి వాట్సాప్‌ తీసుకున్న నిర్ణయం ఏయే ఫోన్స్‌లో సేవలు నిలిచిపోతాయో? ఓ సారి తెలుసుకుందాం.

వాట్సాప్‌ పని చేయని ఫోన్లు ఇవే

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌2, నెక్సస్‌, ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 5సీ, ఆర్కోస్‌ 53 ప్లాటినం, గ్రాండ్‌ ఎస్‌ ఫ్లెక్స్‌ జెడ్‌టీఈ, గ్రాండ్‌ ఎక్స్‌ క్వాడ్‌ వీ 987 జెడ్‌టీఈ, హెచ్‌టీసీ డిజైర్‌ 500,హవాయి ఎసెండ్‌ డీ, డీ1, హెచ్‌టీసీ వన్‌, సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ జీ ప్రో, సామ్‌ గెలాక్సీ నెక్సస్‌, మోటరోలా డ్రాయిడ్‌ రేజర్‌, సోని ఎక్స్‌పీరియా ఎస్‌2, మోటోరోలా గ్జూమ్‌, సామ్‌సంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ 10.01, ఏసర్‌ ఐకోనియా ట్యాబ్‌ ఏ 5003, సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌, హెచ్‌టీసీ డిజైర్‌ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్‌ 2ఎక్స్‌, సోని ఎరిక్సన్‌ ఎక్స్‌పీరియా ఆర్క్‌3 ఫోన్స్‌లో వాట్సాప్‌ అక్టోబర్‌ 24 నుంచి పని చేయదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోన్లన్నీ ఆండ్రాయిడ్‌ 4.1 వెర్షన్‌ కంటే ముందు వచ్చిన ఫోన్లు కాబట్టి సేవలను నిలిపేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!