Smart TV: స్మార్ట్ టీవీల ధరలు అమాంతం తగ్గడం వెనుక ఇంత కథ ఉందా? అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు..
గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ టీవీల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే కంపెనీలకు అదనంగా యాడ్ రెవెన్యూ వస్తోంది. టీవీలపై యాడ్ రెవెన్యూ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. ఇన్ బిల్ట్ యాడ్లు మీ టీవీల్లో ఉంటున్నాయి. అవి మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా వాటిని వినియోగిస్తున్న సమయంలో వచ్చేస్తుంటాయి. వాటితో చాలా మంది వినియోగదారులు విసుగెత్తి పోయి ఉంటారు. అయితే ఆ యాడ్లు రాకుండా కూడా చేసుకోవచ్చు.
స్మార్ట్ టీవీ.. ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండాలని భావిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫారంలకు జనాలు అలవాటు పడటం, యూట్యూబ్ వంటివి ఈ టీవీల్లో వస్తుండటంతో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టీవీలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. వాస్తవానికి డిమాండ్ పెరిగితే మార్కెట్ రూల్ ప్రకారం ధర పెరగాలి. కానీ ఇక్కడ స్మార్ట్ టీవీల విషయంలో మాత్రం స్మార్ట్ టీవీలకు డిమాండ్ పెరుగుతుంటే.. వాటి ధరలేమో బాగా తగ్గిపోతున్నాయి. రెండు మూడేళ్ల క్రితం వరకూ 43, 50 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ కావాలంటే కనీసం రూ. 35,000 నుంచి రూ. 50,000 వరకూ పెట్టాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడు రూ. 25,000లోపే అవి లభ్యమవుతున్నాయి. ఇంతలా వాటి రేటు ఎందుకు పడిపోయింది? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు విషయం తెలుసుకుంటే ముక్కుపై వేలు వేసుకుంటారు.
టీవీల రేట్లు ఎందుకు తగ్గాయంటే..
గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ టీవీల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే కంపెనీలకు అదనంగా యాడ్ రెవెన్యూ వస్తోంది. టీవీలపై యాడ్ రెవెన్యూ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. ఇన్ బిల్ట్ యాడ్లు మీ టీవీల్లో ఉంటున్నాయి. అవి మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా వాటిని వినియోగిస్తున్న సమయంలో వచ్చేస్తుంటాయి. వాటితో చాలా మంది వినియోగదారులు విసుగెత్తి పోయి ఉంటారు. అయితే ఆ యాడ్లు రాకుండా కూడా చేసుకోవచ్చని టీవీ కంపెనీలు ప్రకటించాయి. అదెలాగో తెలుసుకుందాం..
అన్ని టీవీలకు యాడ్స్ వస్తాయా?
చాలా స్మార్ట్ టీవీలు ప్రకటనలను కలిగి ఉన్నప్పటికీ, అన్ని కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. కానీ ప్రధానమైనవి, రోకు వంటి టీవీ సర్వీస్ ప్రొవైడర్లు ప్రకటనలను ప్రదర్శిస్తున్నారు. విజియో శామ్సంగ్, ఎల్జీ, టీసీఎల్ సహా ప్రధాన టీవీ తయారీదారులు వీక్షకులకు వారి వీక్షణ ప్యాట్రన్స్, లొకేషన్, ఇతర సేకరించిన డేటా ఆధారంగా యాడ్లను చూపుతారు. అయితే అవి పెద్ద పెద్ద యాడ్లు కాదు గానీ, తక్కువ సమయంలోనే ఉంటాయి. కానీ ఏదైనా సీరియస్ చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఓ పాప్ రూపంలో అవి వచ్చి ఇబ్బందిని కలుగజేస్తాయి.
స్మార్ట్ టీవీలు కూడా డేటాను సేకరిస్తాయా?
ఇది చాలా మందికి షాక్‌గా అనిపించవచ్చు. కానీ దీనికి సమాధానం మాత్రం అవుననే చెప్పాలి . కొన్ని స్మార్ట్ టీవీలు ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్ (ఏసీఆర్) అని పిలువబడే అంతర్నిర్మిత ఫీచర్‌ను కలిగి ఉంటాయి. ఇది ఛానెల్‌లను ఏ సమయంలో వీక్షిస్తున్నారు అనే దాని గురించి సమాచారాన్ని సేకరిస్తుంది. అది ఎందుకోసం అంటే యాడ్లను సేకరించడానికి ప్రకటనకర్తలకు ఈ డేటాను అందిస్తుంది. అది ఎవరెవరికీ మీ డేటాను ఇస్తుందనేది తెలియాలంటే స్మార్ట్ టీవీని సెటప్ చేసినప్పుడు, నిబంధనలు, షరతులను సరిగ్గా చదవి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
స్మార్ట్ టీవీలో యాడ్లను ఎలా బ్లాక్ చేయాలి?
- డీఎన్ఎస్ సర్వర్‌ని మార్చండి.. మీ స్మార్ట్ టీవీలో, అడ్వాన్స్డ్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లలోకి వెళ్లండి. ఇది అన్ని స్మార్ట్ టీవీలలో ఉంటుంది. దానిలో డీఎన్ఎస్ సర్వర్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. అది ఆటోమేటిక్ అని ఉంటుంది. దానిని మాన్యువల్ లోకి మార్చండి.
- అలాగే యాడ్ గార్డ్(AdGuard)అనే యాప్ ని వినియోగించండి. ఇది ప్రకటనలను నిరోధించడంలో వెబ్‌లో భద్రతను నిర్ధారించడంలో ప్రత్యేకత కలిగిన సాధనం. మీరు అధికారిక వెబ్‌సైట్ నుండి మీ ఆండ్రాయిడ్ టీవీ కోసం AdGuard యాప్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసి , సెటప్ చేయవచ్చు.
- స్మార్ట్ టీవీ సెట్టింగ్‌లను సవరించండి.. మీ ఆండ్రాయిడ్ కోసం మీకు ప్రత్యేక ప్రకటన బ్లాకర్ అవసరం లేదు.టీవీలోనే బిల్ట్ ఇన్ సెట్టింగ్ యాడ్ పర్సనలైజేషన్ ని టర్న్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అందుకోసం ఆండ్రాయాడ్ టీవీలోని హోమ్ స్క్రీన్ లోకి వెళ్లి, దానిలో సెట్టింగ్స్ పై క్లిక్ చేసి, డివైజ్ ప్రిఫరెన్సెస్ లోకి వెళ్లాలి. ఆతర్వాత అబౌట్ క్లిక్ చేయాలి. కింద లీగల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసి, తర్వాత యాడ్స్ అని మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత యాడ్ పర్సనలైజేషన్ ఆప్షన్ ని టర్న్ ఆఫ్ చేయాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..