Whatsapp: మీ వాట్సాప్‌ మరింత సేఫ్‌.. యాప్‌లోకి లాగిన్‌ కావాలంటే ఇకపై..

దీనికి ప్రధాన కారణం వాట్సాప్‌ తీసుకొస్తున్న సెక్యూరిటీ, ఇతర ఫీచర్స్‌. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న ఈ మెసేజింగ్ దిగ్గజం ఇటీవల ఛానల్స్‌ పేరుతో ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటిక అదనంగా ప్రైవసీ విభాగంలో ఎన్నో విప్లవాత్మక ఫీచర్స్‌ను పరిచయం చేసింది వాట్సాప్‌. ఈ క్రమంలోనే తాజాగా యూజర్లకు మరింత ప్రైవసీ, సెక్యూరిటీ...

Whatsapp: మీ వాట్సాప్‌ మరింత సేఫ్‌.. యాప్‌లోకి లాగిన్‌ కావాలంటే ఇకపై..
Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 17, 2023 | 9:51 PM

వాట్సాప్‌.. ఈ యాప్‌ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌ ఏంటని చెప్తే ఠక్కున చెప్పే సమాధానం వాట్సాప్‌. టెక్‌ మార్కెట్లోకి ఎన్నో రకాల కొంగొత్త మెసేజింగ్‌ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్న వాట్సాప్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు.

దీనికి ప్రధాన కారణం వాట్సాప్‌ తీసుకొస్తున్న సెక్యూరిటీ, ఇతర ఫీచర్స్‌. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న ఈ మెసేజింగ్ దిగ్గజం ఇటీవల ఛానల్స్‌ పేరుతో ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటిక అదనంగా ప్రైవసీ విభాగంలో ఎన్నో విప్లవాత్మక ఫీచర్స్‌ను పరిచయం చేసింది వాట్సాప్‌. ఈ క్రమంలోనే తాజాగా యూజర్లకు మరింత ప్రైవసీ, సెక్యూరిటీ అందించే క్రమంలో కొత్త ఫీచర్‌ను జోడిస్తోంది.

ఇప్పటి వరకు వాట్సాప్‌లోకి లాగిన్‌ కావాలంటే వ్యక్తిగతంగా యాప్‌కు పాస్‌వర్డ్‌ మాత్రమే పెట్టుకునే అవకాశం ఉంది. అయితే తాజాగా వాట్సాప్‌ మరింత సెక్యూరిటీని పెంచే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఫేస్‌అన్‌లాక్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కాన్‌ వంటి ఫీచర్స్‌ను జోడించనున్నారు. అంటే ఇకపై మీ వాట్సాప్‌ ఖాతాను ఇతరులు ఓపెన్‌ చేసే అవకాశం లేకుండా చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లో ఫింగర్‌ ప్రింట్, ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌ సమాచారం ఇచ్చి లాగిన్‌ అవ్వొచ్చు.

ఇదిలా ఉంటే ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ ఇటీవల తన అకౌంట్స్‌లోకి లాగిన్‌ కావడానికి పాస్‌కీలను అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇతర యాప్‌లు సైతం పాస్‌కీలను అందించడానికి సిద్ధమవుతున్నాయి. అకౌంట్స్‌ను మరింత సెక్యూర్‌ చేసుకునే క్రంమలో ఓటీపీకి బదులుగా పాస్‌కీలను ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. పాస్‌కీలు అకౌంట్స్‌ను మరింత సెక్యూర్‌గా మారుస్తుందని వాట్సాప్‌ చెబుతోంది. వాట్సాప్‌లో పాస్‌కీ ఆప్షన్‌ ఎనెబుల్‌ చేసుకోవాలంటే ముందుగా అకౌంట్‌లోకి వెళ్లి పాస్‌కీ ఆప్షన్ క్లిక్ చేసి క్రియేట్ పాస్‌కీని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.21.12లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!