Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్స్‌.. ఇక లొకేషన్స్‌ తెలుసుకోవడం..

ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్‌ కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను పెంచుకుంటూపోతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను పరియం చేస్తోంది గూగుల్‌. భారత్‌లో ఈ ఫీచర్స్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో పరిచయం చేయనుంది. ఇంతకీ గూగుల్‌ మ్యాప్స్‌లో తీసుకురానున్న కొత్త ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్స్‌.. ఇక లొకేషన్స్‌ తెలుసుకోవడం..
Google Maps
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 20, 2023 | 6:58 AM

ఒకప్పుడు ఏదైనా అడ్రస్ కావాలంటే పక్కనున్న వారిని అడిగేవాళ్లం. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ఏ అడ్రస్‌ అయినా ఇట్టే తెలుసుకోవచ్చు. గూగుల్‌ మ్యాప్స్‌ దీనిని ఎంతో సులభం చేసింది. ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్ చేస్తే ఎక్కడికైనా క్షణాల్లో వెళ్లిపోవచ్చు. అది కూడా వీలైనంత వరకు షార్ట్ కట్ రూట్‌లో, తక్కువ సమయంలో..

ఇక ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్‌ కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను పెంచుకుంటూపోతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను పరియం చేస్తోంది గూగుల్‌. భారత్‌లో ఈ ఫీచర్స్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో పరిచయం చేయనుంది. ఇంతకీ గూగుల్‌ మ్యాప్స్‌లో తీసుకురానున్న కొత్త ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌ తాజాగా మ్యాప్స్‌లో ఫ్యూయల్ ఎఫిషెంట్ రూటింగ్ పీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు ఇంధనం ఆధా చేసుకోవచ్చు. అంటే యూజర్‌ ఎంచుకున్న డెస్టినేషన్‌కు అత్యంత తక్కువ డిస్టెన్స్‌తో కూడిన మార్గాన్ని మ్యాప్స్‌ సజెస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్‌ను తొలుత గూగుల్‌ ఇండియాతో పాటు ఇండోనేషియాలో పరిచయం చేయనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా రియల్‌ టైమ్‌ ట్రాఫిక్‌ను అంచనా వేస్తూ, వాహనం ఇంజన్‌ ఆధారంగా ఎంత ఇంధనం ఖర్చవుతుంది.? ఏ దారిలో వెళితే తక్కువ పెట్రోల్‌ అవుతుంది.? లాంటి వివరాలను అందిస్తుంది.

ఇక గూగుల్‌ అడ్రస్‌ డిస్క్రిప్షన్‌ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు మరింత కచ్చితత్వంతో లొకేషన్స్‌ను తెలుసుకోవచ్చు. సాధారణంగా ఇండియాలో ల్యాండ్‌ మార్క్‌ ఆధారంగా మ్యాప్స్‌లో ప్రదేశాలను సెర్చ్‌ చేస్తుంటారు. గూగుల్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో.. మ్యాప్స్‌లో ఎక్కడైనా పిన్‌ను సెలక్ట్ చేయగానే మెషిన్‌ లెర్నింగ్‌తో గూగుల్‌ మ్యాప్స్‌ దానంతట అదే సమీపంలో ఉన్న సంబంధిత 5 ల్యాండ్‌ మార్క్స్‌ను చూపిస్తాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు.

ఇక వీటితో పాటు మ్యాప్స్‌లో లెన్స్‌తో పాటు వ్యూ వాకింగ్ నావివేగషన్‌ అనే రెండు కొత్త ఫీచర్లను సైతం పరిచయం చేయనున్నారు. అడ్వాన్స్‌డ్‌ ఏఐ, ఏఆర్‌ టెక్నాలజీల సహాయంతో ఇండియన్‌ యూజర్లకు మెరుగైన స్ట్రీట్‌ వ్యూ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నారు. లెన్స్‌తో యూజర్లు తమ చుట్టుపక్కల ఉన్న వాటిని మరింత మెరుగ్గా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఏదైన వీధిలో కెమెరాను ఉంచితే చాలు యూజర్లు అక్కడ ఉన్న రెస్టరెంట్స్‌, కేఫ్స్‌ వంటి వివరాలు, వాటి రేటింగ్స్‌, ఎప్పుడు ఓపెన్‌ ఉంటాయి.? లాంటి వివరాలను తెలుసుకోవచ్చు. 2024 జనవరి నాటికి దేశంలోని 15 నగరాల్లో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు.

ఇక నడక దారిలో వెళ్లే వారి కోసం కూడా మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు. లైవ్‌ వ్యూ వాకింగ్ నావిగేషన్‌ పేరుతో భారత్‌లో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు యారోస్‌, డైరెక్షన్స్‌, డిస్టెన్స్‌ మార్కర్స్‌తో మెరుగైన ఫలితాన్నిఅందిస్తుంది. ఈ ఫీచర్‌ను తొలుత భారత్‌లో 3000 పట్టణాల్లో అందుబాటులోకి తీసుకురానున్నరు. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు గూగుల్ చెబుతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..