AI Game Characters: వీడియో గేమర్లకు గుడ్‌న్యూస్.. మీ ఏఐ అవతార్‌తో గేమ్ ఆడేలా నయా ఫీచర్ లాంచ్
పెరిగిన టెక్నాలజీ కారణంగా కంప్యూటర్ ద్వారా వీడియో గేమ్స్ ఆడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ముఖ్యంగా గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని గేమ్స్ ఆడే వాళ్లు ఉన్నారంటే అతి శయోక్తి కాదు. గేమింగ్ కంపెనీలు కూడా సరికొత్త అనుభూతినిచ్చేలా ఎప్పటికప్పుడు సరికొత్త గేమ్స్‌ను అందుబాటులో తీసుకువస్తున్నాయి. తాజాగా ప్రముఖ చిప్‌మేకర్ సంస్థ ఎన్విడియా ఏఐ అవతార్‌తో గేమింగ్ ఆడేలా కొత్త చిప్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్టూడియో పీసీల కోసం ఎక్స్ఆర్ఐజీ, ఎంవీపీ, యాంట్ పీసీ, విశాల్ పెరిఫెరల్స్, మరిన్ని వంటి ప్రముఖ సిస్టమ్ బిల్డర్‌లతో సహాయంతో ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది.

సాధారణంగా ఆటలు అంటే శారీరక వ్యాయామాన్ని అందించేలా గ్రౌండ్‌లో ఆడతారు. అయితే భారతదేశంలో ఇంట్లో కూర్చుని ఆడుకునే కొన్న సంప్రదాయం ఆటలు కూడా ఉన్నాయి. కానీ పెరిగిన టెక్నాలజీ కారణంగా కంప్యూటర్ ద్వారా వీడియో గేమ్స్ ఆడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ముఖ్యంగా గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని గేమ్స్ ఆడే వాళ్లు ఉన్నారంటే అతి శయోక్తి కాదు. గేమింగ్ కంపెనీలు కూడా సరికొత్త అనుభూతినిచ్చేలా ఎప్పటికప్పుడు సరికొత్త గేమ్స్‌ను అందుబాటులో తీసుకువస్తున్నాయి. తాజాగా ప్రముఖ చిప్‌మేకర్ సంస్థ ఎన్విడియా ఏఐ అవతార్‌తో గేమింగ్ ఆడేలా కొత్త చిప్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్టూడియో పీసీల కోసం ఎక్స్ఆర్ఐజీ, ఎంవీపీ, యాంట్ పీసీ, విశాల్ పెరిఫెరల్స్, మరిన్ని వంటి ప్రముఖ సిస్టమ్ బిల్డర్‌లతో సహాయంతో ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ స్టూడియో పీసీలు భారతదేశం అంతటా అధీకృత సిస్టమ్ బిల్డర్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ అవతార్ గేమింగ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎక్స్ఆర్ఐజీ పీసీ అందరి దృష్టిని ఆకర్షించింది, ఎన్విడియాకు సంబంధించిన ఆర్‌టీఎక్స్ జీపీయూతో కూడిన పీసీలో రన్నింగ్ స్టేబుల్ డిఫ్యూజన్‌తో మీకు కావాల్సిన ఏదైనా గేమ్ క్యారెక్టర్‌గా మీరు ఎలా రూపాంతరం చెందవచ్చో? చూపించింది. అలాగే మీకు నచ్చిన హీరో ఫేస్‌లతో ఏఐ అవతార్ సృష్టించి గేమ్ ఆడవచ్చని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త వీడియో థంబ్‌నెయిల్‌లు, ప్రచారాలు మరిన్నింటిని క్రమం తప్పకుండా అవసరమయ్యే కంటెంట్ సృష్టికర్తలకు ఈ సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్విడియాకు సంబంధించిన అన్ని స్టూడియో పీసీలు జీఈ ఫోర్స్ ఆర్‌టీఎక్స్ 40 సిరీస్ జీపీయూల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ పీసీలు భారతీయ కంటెంట్ సృష్టికర్తలు, గేమర్‌ల నిర్దిష్ట డిమాండ్‌లను తీర్చడానికి రూపొందించారు. అలాగే ఎన్విడియా స్టూడియో, ఆర్‌టీఎక్స్ ఆల్ టెక్నాలజీలకు సంబంధించిన అన్ని ప్రయోజనాలను పొందేందుకు ముందుగా కాన్ఫిగర్ చేశారు.
2024లో టెక్స్ట్-టు-ఇమేజ్ జనరేషన్ అనేది చాలా మంది ప్రయోగాలు చేశారు. మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన కోపైలెట్,గూగుల్‌కు సంబంధించిన జెమిని వంటి సాధనాలు ఇమేజ్-జనరేషన్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. పైగా ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ ఉచిత సాధనాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు కోపైలెట్, జెమినీ టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ఆధారంగా మాత్రమే చిత్రాలను రూపొందించగలవు. ముఖ్యంగా మీ సొంత చిత్రాలను సవరించడానికి ఇంకా ఎంపిక లేదు. అందువల్ల మీరు మీ చిత్రాలకు వ్యక్తిగత టచ్‌ని జోడించలేరు. అలాగే ఈ ఏఐ సాధనాలు ఆన్‌లైన్‌లో మాత్రమే పని చేస్తాయి. కాబట్టి మీరు ఇంటర్నెట్‌కి కనెక్ట్ కాకపోతే మీరు నిజంగా దేనినీ సృష్టించలేరు. అంతేకాకుండా ఈ ఆన్‌లైన్ ఏఐ సాధనాలు చిత్రాన్ని రూపొందించడానికి సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి. అలాగే చిత్రాన్ని రూపొందించిన తర్వాత దాన్ని సవరించలేరు. సృష్టించిన ఏఐ పిక్చర్ నచ్చకపోతే కొత్త చిత్రాన్ని సృష్టించాలి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








