Flipkart Year End Sale: మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్.. ఈ సారి ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్ ధరలు వ్యత్యాసం ఉండడంతో అందరూ ఆన్‌లైన్ షాపింగ్‌వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు కొత్త కొత్త సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి. తాజా ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 9న ప్రారంభమై డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది.
ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రతి ఒక్కరి చేతిల్లో స్మార్ట్‌ఫోన్ ఉండడంతో అందరూ ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సైట్స్ నుంచి ఆర్డర్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్ ధరలు వ్యత్యాసం ఉండడంతో అందరూ ఆన్‌లైన్ షాపింగ్‌వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు కొత్త కొత్త సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి. తాజా ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 9న ప్రారంభమై డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్న వ్యక్తులు డీల్‌లను యాక్సెస్ చేయవచ్చు. కాబట్టి ఫ్లిప్‌కార్ట్ ఇయర్-ఎండ్ సేల్ సమయంలో అందుబాటులో ఉండే కొన్ని ఆఫర్లను ఓ సారి చూద్దాం.
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో ఐఫోన్ 14, నథింగ్ ఫోన్ (2), గూగుల్ పిక్సెల్ 7, మోటో జీ 54-5జీ, రియల్‌మీ సీ 53, సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5-జీ, పోకో ఎం6 ప్ర, మోటరోలా ఎడ్జ్ 40 నియో, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్‌ఈ, వివో టీ2 వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు ధరలను అందిస్తుంది. ముఖ్యంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 22 ధర రూ. 40,000 లోపుకు లభిస్తుంది. సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం రూ. 49,999కి విక్రయిస్తారు. అలాగే ఐఫోన్ 14 ప్రస్తుతం 128జీబీ స్టోరేజ్ మోడల్‌కు రూ. 60,999 ధర ట్యాగ్‌తో జాబితా చేశారు. కొత్త ఐఫోన్ 15 మోడల్‌పై కూడా కొంత తగ్గింపు ఉంటుందో లేదో ప్రస్తుతం తెలియదు
స్మార్ట్‌ఫోన్‌లతో పాటు లిస్టింగ్ ప్రకారం 75 శాతం వరకు తగ్గింపు ఆఫర్‌తో టీవీలు, ఉపకరణాలపై కూడా డీల్‌లు ఉంటాయి. శీతాకాలం నేపథ్యంలో గీజర్‌లతో పాటు హీటర్‌లపై కూడా 70 శాతం తగ్గింపును అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్‌పై కూడా 50 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. తాజా బిగ్ ఇయర్ ఎండర్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై రూ. 9,990 నుంచి డీల్‌లు కూడా ఉంటాయని పేర్కొంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..