iPhone 14 Plus: ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఎక్స్చేంజ్‌తో కలిపితే..
అయితే ఐఫోన్ సిరీస్ నుంచి కొత్త ఫోన్‌ను లాంచ్ అయిన తర్వాత పాత ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఈ కామర్స్ సైట్స్ పాత సిరీస్ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. తాజాగా దసరా, దీపావళి పండగల నేపథ్యంలో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయిన తర్వాత ఐఫోన్ 14 సిరీస్ ఫోన్స్‌పై తగ్గింపు ధరకు అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో...
టెక్ మార్కెట్లో యాపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఐఫోన్‌లంటే పడి చచ్చే వారు చాలా మందే ఉంటారు. మార్కెట్లోకి ఐఫోన్ కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది అంటే చాలు హడావుడి మాములుగా ఉండదు. అయితే ఐఫోన్ కొనుగోలు చేయాలని ఎంత ఆశ ఉన్నా.. ధర చూసి చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు.
అయితే ఐఫోన్ సిరీస్ నుంచి కొత్త ఫోన్‌ను లాంచ్ అయిన తర్వాత పాత ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఈ కామర్స్ సైట్స్ పాత సిరీస్ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. తాజాగా దసరా, దీపావళి పండగల నేపథ్యంలో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయిన తర్వాత ఐఫోన్ 14 సిరీస్ ఫోన్స్‌పై తగ్గింపు ధరకు అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 14ని సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్14పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఐఫోన్ 14 ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ అసలు ధర రూ. 79,900కాగా సేల్‌లో భాగంగా రూ. 71,99గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే ఈ స్మార్ట్ ఫోన్‌పై 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో గరిష్టంగా రూ. 1250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. వీటితో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌ను పొందొచ్చు. పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా ఏకంగా రూ. 39,150 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ లెక్కన మీ పాత ఫోన్‌తో పూర్తి ఎక్స్చేంజ్ ధర పొందగలిగితే ఐఫోన్ 14 ప్లస్‌ను కేవలం రూ. 34 వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట.
ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్ల విషయానికొస్తే..
ఇక ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఏ15 బయోనిక్ చిప్, 6 కోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఐఫోన్ 14 ప్లస్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీని అందించారు. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జింగ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 గంటల వీడియో ప్లేబ్యాక్, 20 గంటల స్ట్రీమింగ్, 100 గంటల ఆడియో ప్లే బ్యాక్ పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..