Whatsapp: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన వాట్సాప్‌.. ఇకపై వాయిస్‌ మెసేజ్‌లు కూడా..

2021లో వాట్సాప్‌ తీసుకొచ్చిన వ్యూ వన్‌ ఫీచర్‌ ఒక రివల్యూషన్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు అవతలి వ్యక్తికి పంపిన ఫొటోను ఒకసారి చూడగానే ఆటోమెటిక్‌గా డిలీట్‌ అయ్యేలా ఈ ఫీచర్‌ను డిజైన్‌ను చేశారు. దీంతో మీరు పంపిన ఫొటో లేదా వీడియోను ఒక్కసారి చూడగానే దానంతట అదే డిలీట్‌ అవుతుంది. అయితే వాట్సాప్‌ ఈ దిశలో మరో ముందడగు వేసింది. ఇకపై వాయిస్‌ మెసేజ్‌లు కూడా వాటంతట అవే...

Whatsapp: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన వాట్సాప్‌.. ఇకపై వాయిస్‌ మెసేజ్‌లు కూడా..
WhatsApp New feature
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 20, 2023 | 6:47 PM

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడంలో ముందు వరుసలో ఉంటుంది వాట్సాప్‌. మరీ ముఖ్యంగా మార్కెట్లో పోటీ పెరుగుతోన్న తరుణంలో వాట్సాప్‌ కొత్త ఫీచర్లను యూజర్లను చేజారిపోకుండా చూసుకుంటోంది. ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ ఎన్నో ఫీచర్స్‌ను పరిచయం చేస్తోంది.

2021లో వాట్సాప్‌ తీసుకొచ్చిన వ్యూ వన్‌ ఫీచర్‌ ఒక రివల్యూషన్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు అవతలి వ్యక్తికి పంపిన ఫొటోను ఒకసారి చూడగానే ఆటోమెటిక్‌గా డిలీట్‌ అయ్యేలా ఈ ఫీచర్‌ను డిజైన్‌ను చేశారు. దీంతో మీరు పంపిన ఫొటో లేదా వీడియోను ఒక్కసారి చూడగానే దానంతట అదే డిలీట్‌ అవుతుంది. అయితే వాట్సాప్‌ ఈ దిశలో మరో ముందడగు వేసింది. ఇకపై వాయిస్‌ మెసేజ్‌లు కూడా వాటంతట అవే డిలీట్‌ అయ్యే ఫీచర్ను తీసుకొస్తోంది.

వాట్సాప్‌ తీసుకురానున్న ఈ కొత్త ఫీచర్‌ అచ్చంగా వ్యూ వన్‌ ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకుంటే మీరు పంపిన వాయిస్‌ మెసేజ్‌ సైతం ఒకసారి వినగానే దనంతట అదే డిలీట్‌ అవుతుంది. వాయిస్‌ డిస్పాచింగ్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉంది. కొందర బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒకవేళ మీరు కూడా ఈ ఫీచర్‌ను పరీక్షించదలచుకుంటే.. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్‌ 2.23.22.4 వాట్సాప్‌ను అప్‌డేట్ చసుకోవడం ఈ ఫీచర్‌ను పొందొచ్చు. ఇక ఐఓఎస్‌ 23.21.1.73 అప్‌డేట్ చేసుకుంటే ఈ ఫీచర్‌ను పొందొచ్చు.

Whatsapp Voice

ఇక ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మైక్రోఫోన్‌పై నొక్కి వాయిస్‌ మెసేజ్‌ను రికార్డ్‌ చేయండి. రికార్డింగ్ పూర్తియన తర్వాత వాచ్‌ సింబల్‌ కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేయాలి. దీంతో మీరు పంపిన వాయిస్‌ మెసేజ్‌ను రిసీవర్‌ ఒకేసారి వినేలా సెట్‌ అవుతుంది. బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు