OnePlus Pad Go: వన్‌ప్లస్ ట్యాబ్ వచ్చేసిందోచ్.. ధరలు, ఫీచర్లపై ఓ లుక్కేయండి
వరుసగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ యూజర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇక కేవలం స్మార్ట్ ఫోన్స్‌కే పరిమితం కాకుండా స్మార్ట్ వాచ్‌లు, టీవీలతోపాటు ట్యాబ్‌లను సైతం లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే తొలి ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చిన వన్‌ప్లస్ తాజాగా మరో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ ప్యాడ్ గో పేరుతో ఈ ట్యాబ్లెట్‌ను ఇప్పటికే లాంచ్ చేశారు. అక్టోబర్ 6వ తేదీన ఈ ట్యాబ్లెట్‌ను విడుదల చేయగా, తాజాగా ప్రీ ఆర్డర్స్...
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మొదట్లో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేసింది. కెమెరా క్లారిటీతో పాటు పర్ఫామెన్స్ విషయంలో రాజీలేకుండా తీసుకొచ్చిన వన్‌ప్లస్ టెక్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత బడ్జెట్ మార్కెట్‌ను సైతం టార్గెట్ చేసుకొని మార్కెట్లోకి కొంగొత్త ఫోన్‌లను తీసుకొచ్చింది.
వరుసగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ యూజర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇక కేవలం స్మార్ట్ ఫోన్స్‌కే పరిమితం కాకుండా స్మార్ట్ వాచ్‌లు, టీవీలతోపాటు ట్యాబ్‌లను సైతం లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే తొలి ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చిన వన్‌ప్లస్ తాజాగా మరో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ ప్యాడ్ గో పేరుతో ఈ ట్యాబ్లెట్‌ను ఇప్పటికే లాంచ్ చేశారు. అక్టోబర్ 6వ తేదీన ఈ ట్యాబ్లెట్‌ను విడుదల చేయగా, తాజాగా ప్రీ ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్స్ వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు క్రోమా స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి.
ఈ ట్యాబ్లెట్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో లాంచ్ చేశారు. ఒక వైఫైతో పాటు రెండు ఎల్‌టీఈ వేరియంట్ ట్యాబ్స్‌ను విడుదల చేశారు. ధర విషయానికొస్తే వైఫై 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999గా ఉండగా, ఎల్‌టీఈ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999గా నిర్ణయించారు. ఇక ఎల్‌టీఈ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999గా ఉంది. ఇక సేల్‌లో భాగంగా ఈ ట్యాబ్లెట్‌పై డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2000 డిస్కౌంట్ లభించనుంది.
వన్‌ప్లస్ ప్యాడ్ గో ఫీచర్ల విషయానికొస్తే ఈ ట్యాబ్లెట్‌లో 11.3 ఇంచెస్‌తో కూడిన 2.4 రిజల్యూషన్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 400 నిట్స్ బ్రెట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. 6.8 ఎమ్‌ఎమ్ మందంతో రూపొందించిన ఈ ట్యాబ్ బరువు 532 గ్రాములుగా ఉంది. డాల్బీ ఆటమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆక్సీజన్ ఓఎస్ 13.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
It’s not just about remembering a lot. It’s also about how quickly you can recall what you’ve memorised. #OnePlusPadGo is great at both! #allplayallday Know more: https://t.co/NKYjSn3FBM pic.twitter.com/DfxJuGA5Ll
— OnePlus India (@OnePlus_IN) September 29, 2023
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 33 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 8000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్, రెయిర్ కెమెరాను అందించారు. వైఫై 5, బ్లూటూత్ 5.2 యూఎస్‌బీ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫంక్షనాలిటీ వంటి ఫీచర్‌ను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..