Study: మీక్కూడా అలారం స్నూజ్‌ బటన్‌ నొక్కే అలవాటు ఉందా.? అస్సలు బాధపడకండి..

అయితే ఇలా స్నూజ్‌ బటన్‌ నొక్కేవారిని బద్ధకస్తులు అనే ముద్ర వేస్తాం. కానీ ఇలాంటి వాళ్లు బాధపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అలారం మోగగానే వెంటనే నిద్రలేచే వారితో పోల్చితే, స్నూజ్‌ బటన్‌ పెట్టుకొని మేల్కోంటే అభిజ్ఞా పనితీరు మెరుగవుతుందని అంటున్నారు. ఇదేదో ఆషామాషీగా చెప్పిన విషయం కాదు. సుమారు 1732 మందిపై పరిశోధనలు నిర్వహించిన తర్వాత వెల్లడించిన విషయాలు...

Study: మీక్కూడా అలారం స్నూజ్‌ బటన్‌ నొక్కే అలవాటు ఉందా.? అస్సలు బాధపడకండి..
Snoozing Alarm
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 20, 2023 | 5:36 PM

ఉదయం అలరం పెట్టుకొని నిద్రలేచే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అయితే అలరం మోగిన వెంటనే నిద్రలేచే వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అలారం వచ్చిన వెంటనే స్నూజ్‌ బటన్‌నొక్కడం చాలా మందికి అలవాటు. ఇంకాసేపు పడుకుందాంలే అనే భావనలో ఉంటారు. రాత్రి ఎక్కువ సేపు మేల్కొని ఉండడమో, నిద్ర సరిపోకపోవడమో కారణం ఏదైనా.. స్నూజ్‌ బటన్‌ నొక్కుతూ మేల్కోవడాన్ని వాయిదా వేసే వారే ఎక్కువ.

అయితే ఇలా స్నూజ్‌ బటన్‌ నొక్కేవారిని బద్ధకస్తులు అనే ముద్ర వేస్తాం. కానీ ఇలాంటి వాళ్లు బాధపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అలారం మోగగానే వెంటనే నిద్రలేచే వారితో పోల్చితే, స్నూజ్‌ బటన్‌ పెట్టుకొని మేల్కోంటే అభిజ్ఞా పనితీరు మెరుగవుతుందని అంటున్నారు. ఇదేదో ఆషామాషీగా చెప్పిన విషయం కాదు. సుమారు 1732 మందిపై పరిశోధనలు నిర్వహించిన తర్వాత వెల్లడించిన విషయాలు. ఈ వివరాలను జర్నల్‌ ఆఫ్‌ స్లీప్‌ రీసెర్చ్‌ నివేదికలో వెల్లడించారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మేల్కోవడం కంటే, నెమ్మదిగా క్రమంగా నిద్ర నుంచి బయటకు రావడం మగతగా ఉన్న వ్యక్తులకు ఉపయోగపడుతుందని అధ్యాయనంలో తేలింది.

ఇలా క్రమంగా బద్ధకం నుంచి బయటకురావడంతో పాటు రోజంతా బ్రెయిన్‌ ఇంటెలిజెంట్‌గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 69 శాతం మంది స్నూజ్‌ ఫంక్షన్‌ను ఉపయోగిస్తున్నారని తేలింది. సగటును స్నూజ్‌ సమయం 22 నిమిషాలని అధ్యాయనంలో తేలింది. ఇలా 30 నిమిషాల పాటు అలారంను ఆపిన వారు అభిజ్ఞా పరీక్షలలో మెరుగైన ఫలితాలను కనబరిచినట్లు సర్వేలో స్పష్టమైంది. ఇలా అలారంను పోస్ట్‌పోన్‌ చేసే వారిలో అధికులు యువకులేనని తేలింది. ఇక 42 శాతం మంది కౌమారదశలో ఉన్నవారు నిద్ర నుంచి మేల్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని అధ్యాయనంలో తేలింది.

నిద్రలేమితో ఇబ్బంది పడేవారు, గాఢ నిద్రలో నుంచి మేల్కొనడం వల్ల తాత్కాలికంగా స్నూజ్‌ బటన్‌ను నొక్కే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అలారం స్నూజ్‌ చేయడం వల్ల స్లో వేవ్‌ స్లీప్‌ లేదా ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ స్లీప్‌ కంటే తేలికైన నిద్ర దశకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని సైన్స్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!