- Telugu News Photo Gallery Technology photos Flipkart big diwali sale 2023 Huge discount on tablets, check here for full details
Tablet: ట్యాబ్‌లపై ఊహకందని డిస్కౌంట్స్.. ఏకంగా 60 శాతానికి పైగా..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాళి సేల్ 2023 పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మొదలు, గృహోపకరణల వరకు అన్ని రకాల గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్యాబ్లెట్స్‌పై ఫ్లిప్ కార్ట్ ఏకంగా 60 శాతానికిపైగా డిస్కౌంట్స్ అందిస్తున్నారు..
Updated on: Nov 03, 2023 | 1:07 PM

Lenovo Tab M10 2nd Gen: లెనోవో కంపెనీకి చెందిన ఈ ట్యాబ్లెట్ అసలు ధర రూ. 22,000 కాగా 59 శాతం డిస్కౌంట్‌తో రూ. 8,999కే సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్‌లో 10.1 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్‌లో 8 ఎంపీ రెయిర్ ఎమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ట్యాబ్లెట్ సొంతం.

MOTOROLA Tab: మోటోరోలా ట్యాబ్‌పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ట్యాబ్లెట్ అసలు ధర రూ. 34,000కాగా ఏకంగా 58 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 13,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ట్యాబ్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 8 ఎంపీ రెయిర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 7700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ట్యాబ్ సొంతం.

Oppo Pad Air: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ఒప్పోకు చెందిన ఒప్పో పాడ్ ఎయిర్ ట్యాబ్లెట్ అసలు ధర రూ. 34,999కాగా ఏకంగా 61 శాతం డిస్కౌంట్‌తో రూ. 13,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్‌ను 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఇందులో 10.36 ఇంచెస్‌తో కూడిన 2కే డిస్‌ప్లేను అందించారు. 8 ఎంపీ రెయిర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

realme Pad 3: రియల్‌మీ ప్యాడ్ 3 ట్యాబ్లెట్‌పై ఏకంగా 52 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ అసలు ధర రూ. 21,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 10,499కి సొంతం చేసుకోవచ్చు. ఈ ట్యాబ్‌లో 3 జీబీ ర్మా్, 32 స్టోరేజ్‌ను అందించారు. 10.4 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లే ఈ ట్యాబ్ సొంతం. 8 ఎంపీ రెయిర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించార. ఇందులో 7100 ఎమ్‌ఏహెచ్ లిథియం బ్యాటరీని అందించారు.

REDMI Pad: రెడ్‌మీకి చెందిన ఈ ట్యాబ్లెట్ అసలు ధర రూ. 28,999కాగా 50 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 14,499కే సొంతం చేసుకోవచ్చు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ట్యాబ్ షొంతం. ఇందులో 10.61 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఇందులో 8 ఎంపీ రెయిర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 8000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ట్యాబ్ సొంతం.




