- Telugu News Photo Gallery Technology photos Amazon great indian festival huge discount on realme narzo 60X 5G, Check here for full details
Realme narzo: రియల్‌మీ ఫోన్‌పై రూ. 5 వేల డిస్కౌంట్.. రూ. 10 వేలకే 50 ఎంపీ కెమెరా..
పండుగల సీజన్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రియల్ మీ నార్జో స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిఒస్తోంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Nov 03, 2023 | 2:50 PM

అమెజాన్ సేల్‌లో భాగంగా రియల్‌మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ ఫోన్‌పై మంచి డీల్ అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 14,999కాగా, 22 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 11,749కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. వీటితోపాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా రూ. వెయ్యి వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక రియల్‌మీ నార్జో 60 ఎక్స్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్ పవర్ ఫుల్ సూపర్ వూక్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. 70 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకత. బ్యాక్ ఫింటర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.

కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ ఫీచర్ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్, సెల్యూలార్, వైఫై, ట్రూ జీపీఎస్ వంటి ఫీచర్స్‌ను అందించారు. క్వాల్కమ్ మీడయా టెక్ ప్రాసెసర్ ఈ ఫోన్ సొంతం.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్‌లో పంచ్ హోల్ డిస్‌ప్లేను ఇచ్చారు. 680 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్‌ను డిజైన్ చేశారు.




