- Telugu News Photo Gallery Technology photos Flipkart giving huge discount on google pixel 7a smartphone, check here for full details
Google Pixel 7a: దీపావళికి దుమ్మురేపే ఆఫర్.. గూగుల్ పిక్సెల్7 ఫోన్‌పై రూ. 11 వేల డిస్కౌంట్..
మొన్నటి వరకు దసరా పండుగను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ కామర్స్ సైట్స్ భారీ ఆఫర్లను అందించిన విషయం తెలిసిందే. అమెజాన్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ సైతం భారీ ఆఫర్లను ప్రకటించాయి. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ సైతం దీపావళికి.. 'బిగ్ దీపావళి సేల్' పేరుతో సేల్‌ను తీసుకొచ్చింది. నవంబర్ 2వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది..
Updated on: Nov 02, 2023 | 1:50 PM

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ఎన్నో ఆఫర్లను అందిస్తున్నారు. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేసిన వారికి 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగానే గూగుల్ పిక్సెల్ 7ఏపై భారీ ఆఫర్‌ను అందిస్తోంది.

గూగుల్ పిక్సెల్ 7ఏ అసలు ధర రూ. 43,999కాగా సేల్‌లో భాగంగా రూ. 8000 డిస్కౌంట్‌కు లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ. 35,999కి సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3000 డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో అన్ని ఆఫర్లు కలుపుకొని ఈ ఫోన్‌ను రూ. 32,999కే పొందొచ్చు. వీటికి అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద డిస్కౌంట్ పొందొచ్చు.

గూగుల్ పిక్సెల్ 7ఏ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ను అందించారు. ఈ ఫోన్‌లో టెన్సర్ జీ2 ప్రాసెసర్‌ను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో లాంచ్ చేశారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం ఇందులో 13 మెగాపిక్సెల్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4300 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.





























