- Telugu News Photo Gallery Technology photos Google photos adding new feature that can convert photos into as videos
Google Photos: నచ్చిన ఫొటోలు వీడియోలుగా.. గూగుల్ ఫొటోస్‌లో సూపర్ ఫీచర్
గూగుల్ నుంచి వచ్చే ప్రతీ టెక్నాలజీ యూజర్లను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి వాటిలో గూగుల్ ఫొటోలు ఒకటి. ఫోన్‌లో స్టోరేజ్ సమస్యకు చెక్ పెట్టే గూగుల్ ఫొటోస్ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ ఫొటోలను క్లౌడ్‌లోనే స్టోర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా గూగుల్ ఫొటోస్‌లో ఎన్నో రకాల కొత్త ఫీచర్లను జోడించారు. ఈ క్రమంలోనే తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది..
Updated on: Nov 02, 2023 | 11:41 AM

స్మార్ట్ ఫోన్‌లో తీసిన ఫొటోలు వాటంతటవే క్లౌడ్‌లో స్టోర్ అయ్యే విధంగా గూగుల్ ఫొటోస్ ఫీచర్‌ను తీసుకొచ్చింది ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్. దీని సహాయంతో యూజర్లు తమ ఫొటోలను క్లౌడ్‌లో స్టోర్ చేసుకోవచ్చు.

అయితే గూగుల్ ఫొటోస్ యాప్‌కు ఎన్నో రకాల ఫీచర్లను అందిస్తూ వస్తోంది గూగుల్. యూజర్లకు సినిమాటిక్ ఎక్స్‌సీరియన్స్ అందించేలా ఫొటోలను డిజైన్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. హైలైట్ వీడియోలను డిజైన్ చేసుకునేందుకు ఉపయోగపడే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో మనకు ఇష్టమైన ప్రాంతాలు, ఈవెంట్స్‌కు సంబంధించిన వీడియోలను డిజైన్ చేస్తుంది.

ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే.. ముందుగా గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఓపెన్ చేసి గ్యాలరీలో పైన ఉండే ప్లస్ గుర్తును క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ‘హైలైట్ వీడియో’ను సెలక్ట్ చేసుకొని కావాల్సిన ఫొటోలను సెలక్ట్ చేసుకోవాలి.

తేదీ, ప్రాంతాన్ని ఎంచుకుంటే గూగుల్ ఫొటోస్ యాప్ తనకు తానే గ్యాలరీలోంచి మంచి క్లిప్స్, ఫొటోలను ఎంచుకొని వీడియోలుగా మారుస్తుంది. వీడియోకు నచ్చిన మ్యూజిక్‌ను యాడ్ చేసుకోవచ్చు.




