ఒప్పో ఎఫ్23.. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ల సూపర్ వూక్ చార్జర్ సపోర్టుతో వస్తుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 64ఎంపీ ప్రైమరీ కెమెరా తో పాటు, 2ఎంపీ మోనోక్రోమ్, 2ఎంపీ మైక్రోస్కోప్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 28,999 కాగా, అమెజాన్ డిస్కౌంట్ లో కేవలం రూ. 22,999కే కొనుగోలు చేయొచ్చు.