- Telugu News Photo Gallery Technology photos Flipkart big diwali sale 2023 50 percentage discount on boAt Aavante Bar 3100D
BoAt Aavante Bar: రూ. 25 వేల సౌండ్ బార్, రూ. 12 వేలకే.. దీపావళి సేల్‌లో భారీ డిస్కౌంట్..
ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంట్లో సినిమాలు వీక్షించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తోడు భారీ స్క్రీన్‌తో కూడిన టీవీలు సైతం రావడంతో ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందుతున్నారు. ఇక స్క్రీన్‌ను తగ్గట్లుగానే సౌండ్ సిస్టమ్ కూడా ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో మంచి సౌండ్ బార్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా బోట్ కంపెనీకి చెందిన సౌండ్ బార్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది..
Updated on: Nov 04, 2023 | 9:56 AM

ఇండియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ బోట్.. ఇటీవల మార్కెట్లోకి బోట్ అవతార్ బార్ 3100డీ పేరుతో ఓ సౌండ్ బార్‌ను లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ 260 వాట్స్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ అసలు ధర రూ. 24,990కాగా, 51 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు.

దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఒకవేళ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ బార్‌ను రూ. 10,249కే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 80 నుంచి 20,000 హెచ్‌జెడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్‌ను ఇస్తుంది. డాల్బీ డిజిటల్/డిజిటల్ ప్లస్ వంటి సౌండ్ ఫీచర్‌ను అందించారు.

ఇక బోట్ అవతార్ బార్‌లో 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ వంటి ఫీచర్‌ను అందించారు. మాస్టర్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఈ సౌండ్ బార్ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ సౌండ్ బార్ బ్లూటూత్ V5.0/AUX/USBతో కనెన్ట్ చేసకోవచ్చు.

సౌండ్ క్వాలిటీకి పెద్ద పీట వేసిన ఈ సౌండ్ బార్‌లో 60 వాట్స్ వైర్డ్ సబ్ వూఫర్‌ను అందించారు. దీంతో యూజర్లు నాణ్యమైన సౌండ్‌ని పొందొచ్చు. ఇందులో 200 వాట్స్ ఆర్‌ఎమ్‌ఎస్ ప్రీమియం ఆడియోను అందించారు. బోట్ సిగ్నేచర్ సౌండ్ ఫీచర్ ఈ సౌండ్ బార్ సొంతం.




