iPhone 15: ఐఫోన్ 15పై కళ్లు చెదిరే ఆఫర్.. ఇలాంటి డిస్కౌంట్ మళ్లీ రాదు..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు గృహోపకరణాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్15పై తగ్గింపు ధరను ఇస్తున్నారు. ఇంతకీ ఐఫోన్ 15పై లభిస్తోన్న ఆఫర్ ఏంటి.?
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు గృహోపకరణాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్15పై తగ్గింపు ధరను ఇస్తున్నారు. ఇంతకీ ఐఫోన్ 15పై లభిస్తోన్న ఆఫర్ ఏంటి.? ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
యాపిల్ ఐఫోన్15 అసలు ధర రూ. 69,900కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా 16 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 58,249కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
ఇదిలా ఉంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఈ ఫోన్‌పై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా ఈ ఫోన్ ద్వారా రూ. 38 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే బెస్ట్ డీల్‌గా చెప్పొచ్చు.
ఐఫోన్ 15 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఇక ఐఫోన్ ఏ16 బయోనిక్ చిప్, 6 కోర్ ప్రాసెసర్‌నును అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..