AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HMD Flip Phone: త్వరలోనే హెచ్ఎండీ నుంచి ఫ్లిప్ ఫోన్ లాంచ్.. వారే అసలు టార్గెట్..!

తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హెచ్ఎండీ సరికొత్త ఫ్లిప్ ఫోన్ విడుదల చేస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా తక్కువ ధరలోనే ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుందని పేర్కొంటున్నారు. అలాగే ఈ ఫోన్ బార్బీ థీమ్‌తో లాంచ్ చేస్తుందని, ముఖ్యంగా ఈ థీమ్ మహిళలను అమితంగా ఆకట్టుకుంటుందని వివరిస్తున్నారు.

HMD Flip Phone: త్వరలోనే హెచ్ఎండీ నుంచి ఫ్లిప్ ఫోన్ లాంచ్.. వారే అసలు టార్గెట్..!
Hmd Barbie Flip Phone
Nikhil
|

Updated on: Aug 02, 2024 | 8:00 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా, చైనా తర్వాత భారతదేశంలోనే అత్యధిక స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్‌ల వరకు నయా వెర్షన్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను ఫ్లిప్ అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా టాప్ కంపెనీలన్నీ ఫ్లిప్ ఫోన్స్, ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హెచ్ఎండీ సరికొత్త ఫ్లిప్ ఫోన్ విడుదల చేస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా తక్కువ ధరలోనే ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుందని పేర్కొంటున్నారు. అలాగే ఈ ఫోన్ బార్బీ థీమ్‌తో లాంచ్ చేస్తుందని, ముఖ్యంగా ఈ థీమ్ మహిళలను అమితంగా ఆకట్టుకుంటుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎండీ తాజా ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

హెచ్ఎండీ కొత్త ఫ్లిప్ బార్బీ బ్రాండెడ్ ఫోన్ గురించి ఇటీవల హెచ్ఎండీ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోన్ బార్బీ డాల్స్‌కు సంబంధించిన పింక్ కలర్‌లో ఉంటుంది. ఈ బార్బీ-థీమ్ ఫ్లిప్ ఫోన్‌ను డాల్స్ మేనిఫేక్చరింగ్ కంపెనీ మాట్టెల్ భాగస్వామ్యంతో తయారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో హెచ్ఎండీ కంపెనీ ఈ ఫోన్‌ను తొలిసారిగా ప్రదర్శించింది. హెచ్ఎండీ బార్బీ ఫ్లిప్ ఫోన్ ఆగస్ట్ 28న లాంచ్ కానుందని హెచ్ఎండీ ఎక్స్‌లో పేర్కొంది. ఈ మేరకు బార్బీ ఫోన్ గురించి తాజా సమాచారం కోసం తమ కంపెనీ సైట్‌లో సైన్ అప్ చేయమని ఔత్సాహికులకు హెచ్ఎండీ సూచించింది. నోకియా బ్రాండ్ పేరుతో ప్రత్యేకంగా ఫోన్‌లను లాంచ్ చేసే హెచ్ఎండీ బార్భీ థీమ్ ఫోన్ జూలైలోనే అందుబాటులోకి తీసుకువస్తుందని నిపుణులు అంచనా వేయగా ఓ నెల ఆలస్యంగా ఈ ఫోన్‌ను హెచ్ఎండీ లాంచ్ చేస్తుంది. 

హెచ్ఎండీ బార్బీ ఫ్లిప్ ఎస్ 30+ లేదా కేఏఐఓఎస్‌లో రన్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కాకుండా సాంప్రదాయ ఫీచర్ ఫ్లిప్ ఫోన్‌గా రిలీజ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల హెచ్ఎండీ భారతదేశంలో తన సొంత బ్రాండ్‌తో రెండు స్మార్ట్ ఫోన్ పరిచయం చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లు హెచ్ఎండీ క్రెస్ట్, క్రెస్ట్ మ్యాక్స్ పేరుతో అందుబాటులో ఉంచారు. ఈ రెండు ఫోన్‌లు  5జీ స్మార్ట్ ఫోన్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఓఎల్ఈడీ ప్యానెల్, 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో వస్తాయి. హెచ్ఎండీ క్రెస్ట్ 6 జీబీ + 128 జీబీ వెర్షన్ ధర రూ.14,499గా ఉంది. అలాగే క్రెస్ట్ మ్యాక్స్ 8 జీబీ + 256 జీబీ ధర రూ. 16,499గా ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..