AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iQoo Z9s: మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఐక్యూజెడ్9ఎస్ సిరీస్ లాంచ్ ఎప్పుడంటే..?

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. ఇటీవల కాలంలో సూపర్ ఫీచర్లతో వివిధ బ్రాండ్ల ఫోన్‌లు నిత్యం మార్కెట్‌లోకి విడులవుతూనే ఉన్నాయి. లుక్, స్లైల్ విషయంతో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. వాటికి ప్రజల నుంచి ఆదరణ కూడా ఎంతో బాగుంటోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఐక్యూ నుంచి నయా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. త్వరలోనే దేశ మార్కెట్ లో మరో కొత్త ఫోన్ […]

iQoo Z9s: మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఐక్యూజెడ్9ఎస్ సిరీస్ లాంచ్ ఎప్పుడంటే..?
Iqoo Z9s
Nikhil
|

Updated on: Aug 02, 2024 | 8:17 PM

Share

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. ఇటీవల కాలంలో సూపర్ ఫీచర్లతో వివిధ బ్రాండ్ల ఫోన్‌లు నిత్యం మార్కెట్‌లోకి విడులవుతూనే ఉన్నాయి. లుక్, స్లైల్ విషయంతో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. వాటికి ప్రజల నుంచి ఆదరణ కూడా ఎంతో బాగుంటోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఐక్యూ నుంచి నయా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. త్వరలోనే దేశ మార్కెట్ లో మరో కొత్త ఫోన్ సందడి చేయనుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రముఖ కంపెనీ ఐక్యూ జెడ్9ఎస్ సిరీస్‌ను లాంచ్ చేసేందుకు ఆ కంపెనీ సన్నాహాలు పూర్తి చేసిందని తెలుస్తుంది. కొత్త సిరీస్ ను ఆగస్టు 21న విడుదల చేస్తున్నట్టు కంపెనీ సీఈవో నిపున్ మారియా వెల్లడించారు.

ఇటీవల కాలంలో ఐక్యూ నుంచి ఎలాంటి కొత్త ఫోన్ విడుదల కాకపోవడంతో ఐక్యూ ప్రియులు కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త లాంచ్ గురించి చెప్పిన ఆ ఫోన్ ఏంటి? ఆ ఫోన్ ప్రత్యేకతల గురించి ఏ విషయాలు పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. అయితే గతంలో వచ్చిన కొన్ని నివేదికల ఆధారంగా నిపుణులు త్వరలో లాంచ్ చేయబోయే ఫోన్ గురించి పలు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఐక్యూ జెడ్9ఎస్, ఐక్యూ జెడ్9ఎస్ ప్రో మోడళ్లు విడుదల అవుతాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి భారత్‌లో త్వరలో లాంచ్ చేసేది కచ్చితంగా ఐక్యూ జెడ్9 కు కొత్త ఐక్యూ జెడ్9ఎస్ రీబ్రాండెడ్ వెర్షన్ అని భావిస్తున్నారు. ఐక్యూజెడ్9ఎస్ విడుదల తేదీని ఆ కంపెనీ సీఈవో నిపుణ్ మారియా అధికారంగా నిర్ధారించారు. ఈ మేరకు ఎక్స్ లో (గతంలో ట్విటర్) పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా విడుదల తేదీతో పాటు ఫోన్ ఇమేజ్ ను అప్ లోడ్ చేశారు.

గోల్డెన్ కలర్‌లో నయా స్టార్ట్ ఫోన్ ఆకట్టుకుంటోంది. అలాగే సెగ్మెంట్ లో వేగవంతమైన కర్వ్డ్ స్క్రీన్ ఫోన్ అనే ట్యాగ్‌లైన్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే ఇటీవల ఐక్యూ జెడ్9ఎస్ సిరీస్ హ్యాండ్‌సెట్‌లలో ఒకదాని డిజైన్‌ను మరియా పరిచయం చేశారు. వైట్ కలర్‌లో వైట్ మార్బుల్ డిజైన్‌తో ఎంతో ఆకట్టుకుంటుంది.  స్మార్ట్‌ఫోన్ పై భాగంగా ఎడమ వైపు దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌‌తో వస్తుంది. కుడి వైపు అంచున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీఈవో మారియా మాట్లాడుతూ జెడ్ సిరీస్ లో కంపెనీ ఒకేసారి రెండు మోడళ్లను విడుదల చేయడం ఇదే ప్రథమమన్నారు. ఇది ఒక గొప్ప ఆవిష్కరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఐక్యూజెడ్9ఎస్ హ్యాండ్‌సెట్‌లలో ఒకటి గీక్ బెంచ్ లో కనిపించింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ ఆధారంగా పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?