ఒడిశా రైతు క్రియేటివిటీ.. లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉండలేక కారును తయారు చేశాడు.. ఆ కారు స్పెషాలిటీ ఏంటో తెలుసా..

uppula Raju

uppula Raju |

Updated on: Mar 15, 2021 | 5:18 PM

Odisha Farmer Builds Electric Car : ఏ కాలంలోనైనా నిత్యం శ్రమించేవాడు రైతు. అతడు ఖాళీగా ఉంటే లోకానికి అన్నం పెట్టే నాధుడే లేడు. కరోనా

ఒడిశా రైతు క్రియేటివిటీ.. లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉండలేక కారును తయారు చేశాడు.. ఆ కారు స్పెషాలిటీ ఏంటో తెలుసా..
Odisha Farmer Builds Electr

Odisha Farmer Builds Electric Car : ఏ కాలంలోనైనా నిత్యం శ్రమించేవాడు రైతు. అతడు ఖాళీగా ఉంటే లోకానికి అన్నం పెట్టే నాధుడే లేడు. కరోనా మహమ్మారి వల్ల గత సంవత్సరం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించారు. అయితే ఆ సమయంలో ఒడిశాకు చెందిన రైతు ఏకంగా కారునే రెడీ చేశాడు. రైతేంటి.. కారేంటి అనుకుంటున్నారు. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..

ఒడిషాలోని మయూర్భంగ్ జిల్లా, కరంజియా సబ్ డివిజన్‌కు చెందిన సుశీల్ అగర్వాల్.. లాక్‌డౌన్‌ టైమ్‌లో తనలో ఉన్న క్రియేటివిటీకి పని చెప్పాడు. తనుండే ఏరియాలోనే న్యూ ఐడియాస్ ఇన్వెన్షన్‌పై వర్క్‌షాప్ జరిగింది. ఆ సమావేశానికి హాజరైన సుశీల్.. అక్కడ పరిచయమైన మెకానిక్స్ సాయంతో వెహికల్‌ తయారీ మొదలెట్టాడు. 850 వాట్ల మోటార్‌తో పాటు 54 వోల్ట్‌ల బ్యాటరీ, ఇతర పార్ట్స్ ఒక్కొక్కటిగా అసెంబుల్ చేస్తూ వచ్చాడు. మొత్తం 8 నెలల పాటు శ్రమించి ఎట్టకేలకు వెహికల్ రూపొందించాడు. కాగా ఇందులో ఉండే బ్యాటరీ, సౌరశక్తి ద్వారా చార్జ్ అవుతుండటం విశేషం. దీన్ని చార్జ్ చేసేందుకు 8.30 గంటల సమయం పట్టనుండగా, సింగిల్ చార్జ్‌తో 300 కిలోమీట్లరు ప్రయాణించొచ్చు.

ఇద్దరు మెకానిక్స్‌తో పాటు ఎలక్ట్రిక్ వర్క్స్ చేసే తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని రూపొందించినట్లు సుశీల్ చెప్పారు. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని తాను లాక్‌డౌన్ కాలంలోనే ఊహించానని, అందుకే సొంత వెహికల్ తయారీకి పూనుకున్నానని తెలిపారు. వెహికల్ పైభాగంలో ఉండే సోలార్ ప్యానెల్స్ ద్వారా చార్జ్ అయ్యే ఈ వాహనాన్ని చూసి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు చేసేవారికి భారత ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu