Instagram Feature: మెటా కొత్త ఫీచర్.. ఇకపై మీ పిల్లల ఇన్‌స్టా వాడకాన్ని ఈజీగా తగ్గించొచ్చు!
పిల్లల భద్రత కోసం మెటా ఒక సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది 16 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువ సేపు ఆన్‌లైన్ ప్రపంచంలో ఉండకుండా చూసుకుంటుంది. పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువసేపు ఉపయోగిస్తే, ఈ యాప్ దాని గురించి సమాచారాన్ని రిమైండ చేస్తుంది.అంతే కాకుండా యాప్‌ను క్లోజ్ చేయమని సలహా కూడా ఇస్తుంది.

ప్రస్తుత జనరేషన్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతున్నారు. దీని ప్రభావం చిన్నపిల్లలపై మరీ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఒక్కసారి ఫోన్ పట్టుకొని ఇన్‌స్టా ఒపెన్ చేశారో.. ఇక గంటల పాటు అందులోనే మునిగితేలుతూ ఉంటారు. ఈ కారణంగా పిల్లలు చెడిపోతున్నారని చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో దీనిపై దృష్టి పెట్టి మెటా పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ముఖ్యంగా పిల్లలను కోసం ప్రవేశపెట్టిన ఫీచర్ అని మెటా పేక్కొంది. ఇన్‌స్టా ప్రవేశ పెట్టిన ఈ కొత్త ఫీజర్ పేరు టీన్ అకౌంట్స్, ఇది వాస్తవానికి రక్షణగా పనిచేస్తుంది. దీన్ని ఇటీవలే భారత్‌లో లాంచ్ చేశారు.
టీన్ అకౌంట్ ఎలా పనిచేస్తుంది
ఇన్‌స్ట్రాగ్రామ్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ప్రకారం..16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారుల ఖాతాలలో కొన్ని డిఫాల్ట్ మార్పులు కనిపిస్తాయి. కొత్త అప్‌డేట్ తర్వాత, టీనేజర్ల ఖాతాలు డిఫాల్ట్‌గా ప్రైవేట్ ఖాతాలుగా మారుతాయి. అంతేకాకుండా ఈ కొత్త ఫీచర్‌తో పిల్లల ఖాతాలకు లిమిటెడ్ వ్యక్తులు మాత్రమే మెసెజ్ పంపే యాక్సెస్ ఉంటుంది. అలాగే, తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ కార్యాచరణను కూడా ఈజీగా పరిశీలించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆన్‌లైన్ భద్రతపై చర్చ
నిజానికి, మెటా తన ఇన్‌స్టాగ్రామ్‌ను టీనేజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ఏడాది ప్రారంభంలో, సేఫర్ ఇంటర్నెట్ డే సందర్భంగా, మెటా తన భద్రతను అప్‌డేట్ చేసింది. దీనికి 2025 సేఫ్టీ అప్‌డేట్ అని పేరు పెట్టింది. అయితే గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆన్‌లైన్ భద్రత గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మెటా పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విడుదల జరిగింది.
ఈ మార్పు కొత్త ఖాతాలో కనిపిస్తుంది.
ఈ కొత్త ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్ తర్వాత, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, అతని అకౌంట్ ఆటోమేటిక్‌గా ప్రైవేట్‌గా మారుతుంది. అంటే ఈ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారకు మాత్రమే ఆ పోస్ట్‌ను చూడగలరు లేదా ట్యాగ్ చేయగలరు. అంతే కాకుండా ఈ ఖాతాలకు డైరెక్ట్ మెసెజ్ చేసేందుకు కూడా వాళ్లకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది.
ఈజీగా బ్లాక్, రిపోర్ట్ చేసే సదుపాయం
టీనేజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఇన్‌స్టాగ్రామ్ బ్లాకింగ్, రిపోర్టింగ్ సేవను కూడా మెటా మెరుగుపరిచింది. వినియోగదారులు కొత్త వన్-ట్యాప్ సాధనాన్ని పొందుతారు, దీని సహాయంతో మీరు ఏ వ్యక్తినైనా సులభంగా బ్లాక్ చేయవచ్చు, అతనిపై రిపోర్ట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇందులో కొత్త స్లీప్ మోడ్‌ను కూడా మెటా యాడ్ చేసింది. దీని ఫీచర్‌తో రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు యాప్ మ్యూట్‌లో ఉంటుంది. దీంతో మనకు ఎలాంటి నోఫికేషన్ అలర్ట్స్ కూడా రావు. యూజర్ గంటకంటే ఎక్కువ సమయం యాప్‌లో ఉంటే ప్లాట్‌ఫామ్ అతనికి రిమైండర్ ఇస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




