Elon Musk: ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్.. స్పందించిన ఎలాన్ మస్క్
స్మార్ట్‌ఫోన్ వాడేవారిలో మైక్రోబ్లాగింగ్ యాప్ ట్విట్టర్ గురించి తెలియని వారుండరు. ఎంతో కాలంగా అత్యంత ప్రజాధారణ పొంది సేవలు అందిస్తోంది ఈ యాప్. అయితే ఇప్పుడు ఈ ట్విట్టర్‌కు పోటీగా మరో సోషల్ మీడియా సంస్థ మెటా ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. థ్రెడ్స్ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ గురువారం నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వచ్చేసింది.

స్మార్ట్‌ఫోన్ వాడేవారిలో మైక్రోబ్లాగింగ్ యాప్ ట్విట్టర్ గురించి తెలియని వారుండరు. ఎంతో కాలంగా అత్యంత ప్రజాధారణ పొంది సేవలు అందిస్తోంది ఈ యాప్. అయితే ఇప్పుడు ఈ ట్విట్టర్‌కు పోటీగా మరో సోషల్ మీడియా సంస్థ మెటా ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. థ్రెడ్స్ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ గురువారం నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన ఈ థ్రెడ్స్ యాప్ పై నెటీజన్లు తమ విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ నెటీజన్ ఇందుకు సంబంధించి ఓ నెటీజన్ వ్యంగంగా ట్వీట్ చేశాడు. థ్రెడ్స్ యాప్‌ను మెటా సంస్థ కేవలం కీబోర్డులోని Crl,C,V లతో అందుబాటులోకి తెచ్చేందని ట్వీట్ చేశాడు. అంటే కాపీ, పెస్ట్ చేసి ఈ యాప్ తీసుకొచ్చారని ఈ ట్వీ్ట్‌లోని సారాంశం.
అయితే ఈ ట్వీట్‌పై ఎలాన్ మస్క్ స్పందించారు. నవ్వుతున్న ఎమోజీనికి పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. ఇదిలా ఉండగా థ్రెడ్స్ యాప్‌ను ప్రారంభించిన మొదటి రెండు గంట్లలోనే దాదాపు 20 లక్షల మంది ఈ అకౌంట్లను తెరిచారు. ఆ తర్వాత తొలి నాలుగు గంటలకు ఈ సంఖ్య సుమారు 50 లక్షల వరకు పెరిగింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ తెలిపారు. అయితే ఈ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వినియోగించి లాగిన్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో వర్డ్స్, లింక్స్, ఫోటోలు, ఐదు నిమిషాల నిడివి ఉన్న వీడియోలు కూడా పోస్టు చేయవచ్చు.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..