AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter New Feature: ఇకపై ఫోన్ నంబర్ లేకుండానే ఆడియా, వీడియో కాల్స్.. ట్విట్టర్‌-Xలో కీలక మార్పులు..

X New Feature: ఎలోన్ మస్క్‌.. సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్‌ ట్విట్టర్‌ని టేకోవర్ చేసుకుని, దానికి ‘ఎక్స్’ ఎలోన్ మస్క్‌గా పేరు మార్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా X (ట్టిట్టర్) లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల ఆదరణ పొందుతున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్- ట్విట్టర్ మరో కీలక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.

Twitter New Feature: ఇకపై ఫోన్ నంబర్ లేకుండానే ఆడియా, వీడియో కాల్స్.. ట్విట్టర్‌-Xలో కీలక మార్పులు..
Elon Musk
Shaik Madar Saheb
|

Updated on: Aug 31, 2023 | 3:25 PM

Share

X New Feature: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌.. సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్‌ ట్విట్టర్‌ని టేకోవర్ చేసుకుని, దానికి ‘ఎక్స్’ ఎలోన్ మస్క్‌గా పేరు మార్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా X (ట్టిట్టర్) లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల ఆదరణ పొందుతున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్- ట్విట్టర్ మరో కీలక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఎక్స్‌లో తర్వలో ఆడియో, వీడియో కాల్ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు X సంస్థ బాస్ ఎలన్ మస్క్ తెలిపారు. X ప్లాట్‌ఫారమ్‌లో ఇంటిగ్రేటెడ్‌గా ఆడియో, వీడియో కాల్స్ వంటి ఫీచర్లను X చూస్తుందని గురువారం ఎలోన్ మస్క్ ప్రకటించారు. ఈ ఫీచర్ Android, iOS, PC, Macకి అనుకూలంగా ఉంటుందన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఫీచర్ కోసం ఎటువంటి సిమ్ కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఫోన్ నంబర్ లేకుండానే వీడియో, ఆడియో కాల్స్ చేయవచ్చు. ‘‘Xకి వస్తున్న వీడియో & ఆడియో కాల్‌లు: – iOS, Android, Mac & PCలో పని చేస్తుంది – ఫోన్ నంబర్ అవసరం లేదు – X అనేది ప్రభావవంతమైన గ్లోబల్ అడ్రస్ బుక్.. ఇది ప్రత్యేకమైనది’’ అంటూ మస్క్ ట్టిట్టర్ హ్యాండిల్ X లో రాశాడు. అయితే ఫీచర్ల లాంచ్ కి సంబంధించి ఎలాంటి తేదీ ఇవ్వలేదు. కానీ ఇందులోని ఫీచర్లన్ని యూనిక్ గా ఉంటాయని మస్క్ స్పష్టం చేశారు.

జూలైలో కంపెనీ డిజైనర్ ఆండ్రూ కాన్వే ఈ ఫీచర్‌ను సూచించారు. కాన్వే ఒక నెల క్రితం చర్యలో ఉన్న ఫీచర్ స్క్రీన్‌షాట్‌లను పంచుకున్నారు. అప్పటినుంచి నెటిజన్లలో ఈ సౌకర్యాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మస్క్ ట్వీట్..

అయితే, X ‘ఎవ్రీథింగ్ యాప్’ గా మారాలనే సంకల్పంతో ఎలోన్ మస్క్ ఆడియో, వీడియో కాల్‌ సౌకర్యాలను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మస్క్ తరచుగా మెటా బాస్ మార్క్ జుకర్‌బర్గ్‌కు ఛాలెంజర్‌గా చూసుకుంటారు. ఫేస్‌బుక్ ఇతర సైట్ల తరహాలోనే Xని పెద్ద బ్లాగింగ్ సైట్‌గా మార్చాలనే దృష్టితో మస్క్ కొత్త ఫీచర్లను తీసుకువస్తున్నారు.

ఈ నెల ప్రారంభంలో Xలో ఎలోన్ మస్క్ ఒక పోస్ట్‌ చేసి కొన్ని విషయాలను చెప్పారు. “ఇప్పుడు గొప్ప సోషల్ నెట్‌వర్క్‌లు ఏవీ లేవు అనేది విచారకరమైన నిజం. చాలా మంది ఊహించినట్లు మేము విఫలం కావచ్చు.. కానీ అగ్రస్థానంలో కనీసం ఒకటి ఉండేలా చేయడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము’’. అంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆగస్ట్ 25న X ప్లాట్‌ఫారమ్‌లో ఆడియో, వీడియో ఫీచర్ల గురించి పోస్ట్ చేశారు. ఇందులో ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు 2 గంటల వరకు సుదీర్ఘ వీడియోలను పోస్ట్ చేయడానికి అనుమతించడం, మొబైల్ నుంచి మెరుగైన ప్రత్యక్ష ప్రసారం నాణ్యత. Android, iOSలో వీడియో ప్లేయర్, కో-హోస్ట్‌లో మాట్లాడటం వంటివి ఉన్నాయి. వెబ్‌లో ఒక స్పేస్ – Spacesలో మిలియన్ల మంది పాల్గొనేవారికి మద్దతునిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..