Chandrayaan-3: బిడ్డ ‘రోవర్‌’ ఆడుతుంటే ప్రేమగా చూస్తున్న తల్లి ‘విక్రమ్‌’.. వీడియో తీసిన ల్యాండర్

సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటూ చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతోందని ఇస్రో గురువారం ట్వీట్ చేసింది. ఈ భ్రమణం ల్యాండర్ కెమెరాలో బంధించబడింది. చంద మామ పెరట్లో పిల్లాడు ఆడుకుంటున్నట్టు, అమ్మ తనని ప్రేమగా చూస్తున్నట్టుంది కదా. చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యి ఒక వారం అయ్యింది. ఇప్పుడు దానికి ఒక వారం సమయం మాత్రమే ఉంది..

Chandrayaan-3: బిడ్డ 'రోవర్‌' ఆడుతుంటే ప్రేమగా చూస్తున్న తల్లి 'విక్రమ్‌'.. వీడియో తీసిన ల్యాండర్
Isro Twitt
Follow us
Subhash Goud

|

Updated on: Aug 31, 2023 | 2:37 PM

భారతదేశం మిషన్ చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై చురుకుగా పరిశోధన కొనసాగిస్తోంది. ప్రతిరోజూ తాజా రిపోర్ట్‌ను పంపిస్తోంది రోవర్‌. నిన్న ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ చిత్రాన్ని తీసింది. ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ తన కెమెరాలో ప్రజ్ఞాన్‌ను బంధించింది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై తిరుగుతోంది. ఆ సమయంలో విక్రమ్ ల్యాండర్ దాని వీడియోను చిత్రీకరించింది. తల్లి నీడలో పిల్ల ఆటలాడుకుంటున్నట్లుగా ఉంది ఈ వీడియో చూస్తుంటే.

సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటూ చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతోందని ఇస్రో గురువారం ట్వీట్ చేసింది. ఈ భ్రమణం ల్యాండర్ కెమెరాలో బంధించబడింది. చంద మామ పెరట్లో పిల్లాడు ఆడుకుంటున్నట్టు, అమ్మ తనని ప్రేమగా చూస్తున్నట్టుంది కదా.

చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యి ఒక వారం అయ్యింది. ఇప్పుడు దానికి ఒక వారం సమయం మాత్రమే ఉంది. నిన్ననే ప్రజ్ఞాన్ రోవర్ క్లిక్ చేసిన విక్రమ్ ల్యాండర్ చిత్రాలను ఇస్రో ట్వీట్ చేసింది. అందులో చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ కపిపించడం చూడవచ్చు.

భారత్ ఎన్నో విజయాలు సాధించింది:

గురువారం మరో టెక్నిక్ ద్వారా చంద్రునిపై సల్ఫర్ ఉన్నట్లు ఆధారాలను కనుగొన్నామని ఇస్రో ధృవీకరించింది. ఇంతకు ముందు కూడా ఇస్రో ఇతర పద్ధతుల ద్వారా చంద్రునిపై తన ఉనికిని నిర్ధారించింది. ఇది మాత్రమే కాదు.. చంద్రుని నేలలో సల్ఫర్‌తో పాటు ఆక్సిజన్‌తో సహా మొత్తం 8 మూలకాలు గుర్తించారు. ఇది ఇస్రోకి పెద్ద విజయమనే చెప్పాలి.

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై అనేక మూలకాలను మాత్రమే కాకుండా ఉష్ణోగ్రతలో తేడాను కూడా కనుగొన్నారు. చంద్రునిపై సుమారు 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఉంది. ఉపరితలం లోపలికి వెళ్లడం, చంద్రుని ఉష్ణోగ్రత కూడా మైనస్‌కు వెళుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్, ప్రజ్ఞాన్‌లు చేసిన ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.

చంద్రయాన్-3 మిషన్ జూలై 14న ప్రయోగం చేపట్టింది ఇస్రో. ఆగస్టు 23న అది చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగింది. ఇస్రో ప్రకారం.. దాని జీవితం కేవలం 14 రోజులు మాత్రమే. అంటే చంద్రునిపై ఒక రోజు. చంద్రుని ఈ భాగంలో సూర్యుడు అస్తమించగానే ప్రజ్ఞాన్, విక్రమ్ ల్యాండర్‌ తమ పరిశోధనను నిలిపివేస్తాయి.

అయితే రోవర్‌ సేఫ్‌ రూట్‌ కోసం వెతుకుతున్న వీడియోను షూట్‌ చేసిన ల్యాండర్‌. తన బిడ్డ ఆడుతుంటే తల్లి ప్రేమగా చూస్తున్న సందేశం అంటూ ఇస్రో ట్వీట్‌ చేసింది. 28వ తేదీన చంద్రయాన్‌-3పై ఇస్రో కీలక ప్రకటన చేసింది. ప్రజ్ఞాన్‌ రోవర్‌ ముందు పెద్ద గొయ్యి గుర్తించినట్టు తెలిపింది. వెంటనే వెనక్కి రావాలని ఇస్రో కమాండ్‌ ఇచ్చింది. కమాండ్‌ను తీసుకున్న తర్వాత సురక్షిత ప్రాంతానికి రోవర్‌ చేరుకుంది. గొయ్యి ఫోటోను కూడా రోవర్‌ పంపింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రోవర్‌ చక్కర్లు కొడుతున్న వీడియోను ఇస్రో షేర్‌ చేసింది. సేఫ్‌ రూట్‌ కోసం వెతుకుతోంది అంటూ ట్వీట్ చేసింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి