AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సెర్చింగ్ ‘యంత్రుడు’ వచ్చేశాడు.. హిందీలోనూ మాట్లాడుతాడు..

Google AI Search Tool: వినియోగదారులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ ప్రకటించింది. ఇప్పటికే అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఇప్పడు ఇండియాతో పాటు జపాన్ లోనూ ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. జనరేటివ్ ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ పేరిట ఈ ప్రత్యేక టూల్ ని గూగుల్ తీసుకొచ్చింది. ఇది ప్రాంప్ట్ లకు టెక్ట్స్, వివరణలతో పాటు చిత్రాలను అందిస్తుంది.

గూగుల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సెర్చింగ్ ‘యంత్రుడు’ వచ్చేశాడు.. హిందీలోనూ మాట్లాడుతాడు..
Google Ai Search Tool
Madhu
|

Updated on: Aug 31, 2023 | 4:00 PM

Share

ఆల్ఫాబెట్ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మన దేశంలోని వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇక్కడి వినియోగదారులకు కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇప్పటికే అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఇప్పడు ఇండియాతో పాటు జపాన్ లోనూ ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. జనరేటివ్ ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ పేరిట ఈ ప్రత్యేక టూల్ ని గూగుల్ తీసుకొచ్చింది. ఇది టెక్ట్స్ తో పాటు ప్రాంప్టింగ్ ఇస్తే చిత్రాలను అందిస్తుంది. జపాన్లోని లోకల్ భాషలలో అందుబాటులోకి వచ్చిన ఈ టూల్ మన దేశంలో ఇంగ్లిష్, హిందీ భాషలలో వినియోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ని సెర్చ్ జనరేటివ్ ఎక్స పీరియన్స్(ఎస్జీఈ) అని కూడా పిలుస్తారు. క్రోమ్ డెస్క్ టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ లోని తాజా వెర్షన్ గూగుల్ యాప్ ద్వారా ఈ ఫీచర్ ని వినియోగించని ఆ కంపెనీ పేర్కొంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా ‘కృత్రిమ’ యుద్ధం..

ప్రపంచంలోని టెక్ దిగ్గజాల మధ్య కృత్రిమ యుద్ధం నడుస్తోంది. అదేనండి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ)తోకూడిన సాంకేతికతపై అన్ని కంపెనీలు కృషి చేస్తున్నాయి. చాట్ జీపీటీ రాకతో ఈ యుద్ధం తారస్థాయికి వెళ్లింది. దానిని అధిగమించేందుకు గూగుల్ వంటి దిగ్గజాలు కూడా ప్రయత్నాలు ప్రారంభించి, ఒక్కొక్కటిగా ఫలితాలను ప్రపంచానికి అందిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల అమెరికాలో ఆర్టిఫిషీయల్ ఇంటెలెజెన్స్ తో కూడిన సెర్చ్ టూర్ ఆవిష్కరించిన గూగుల్ ఇప్పుడు మన దేశంతో పాటు జపాన్ లోని లోకల్ భాషలలోని టూల్ తీసుకొచ్చింది. మన దేశంలోని హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ ఏఐ టూల్ ని వినియోగించుకోవచ్చు..

ఎలా వాడాలంటే..

మీరు గూగుల్ యాప్ లేదా డెస్క్ టాప్ క్రోమ్ లను అప్ డేట్ చేసుకోవాలి. తర్వాత సెర్చ్ పేజీ ఓపెన్ చేశాక ఎడమ వైపు ఎగువన మూలన ల్యాబ్స్ చిహ్నంపై నొక్కాలి. దీంతో మీరు పైన ఏఐ రూపొందించిన స్నాప్ షాట్ తో కూడిన కొత్త ఇంటిగ్రేటెడ్ రిజల్ట్స్ మీకు సెర్చ్ పేజీపై కనిపిస్తాయి. ఈ స్నాప్ షాట్ ల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు దానికి సంబంధించిన లింక్ లను మీకు ఏఐ టూల్ చూపుతుంది.

ఇవి కూడా చదవండి

అవి చూసిన తర్వాత మీకు అవసరం అయిన వేరే ప్రశ్నలను ఏఐని అడగవచ్చు. కొత్త చాట్ మోడ్ లోకి మీరు వెళ్లడానికి ఏఐ సూచించిన ప్రశ్నలలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఏ అంశం గురించి అయితే మీరు ప్రశ్న వేయాలనుకొంటున్నారో అనే దానికి ఇది మీకు సహాయపడుతుంది. అలాగే సాధారణ సెర్చ్ ఫలితాలు కూడా మీకు కింద కనిపిస్తాయి. అదే సమయంలో పేజీ అంతటా బోల్డ్ బ్లాక్ టెక్ట్స్ లో స్పాన్సర్డ్ లేబుల్ తో ప్రకటన స్లాట్ లు కూడా మీకు కనిపిస్తాయి.

ఉదాహరణ చెప్పాలంటే.. హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభ టెక్ ఏది? దాని కోసం ఎలా సిద్ధం కావాలి ? అని ప్రశ్నించారనుకోండి. దానికి మీకు ఆ ప్రశ్న కిందే ఏఐ రూపొందించిన సారాంశం కనిపిస్తుంది. అలాగే ఇంకా లోతుగా ఏదైనా సమాచారం కావాలంటే కింద మళ్లీ ప్రశ్న వేసే తెలుసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..